Sunday, 14 December 2025

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైన‌పు విగ్ర‌హ ఆవిష్కరణ:

ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో కీర్తి కిరీటం చేరింది. తాజాగా ఆయ‌న లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైన‌పు విగ్ర‌హం ఆవిష్క‌రించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాలుపంచుకున్నారు. చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా మైనపు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం విశేషం.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వెలసిన తన మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులిచ్చారు. రామ్ చ‌ర‌ణ్ త‌న పెట్ డాగ్ రైమ్‌తో క‌లిసి ఫొటోల‌కి పోజులిచ్చారు. అయితే టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అయితే మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు ప్రతిమ ఏర్పాటు చేస్తామని వారు ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ త‌న‌తో పాటు త‌న పెట్ డాగ్ రైమ్ బొమ్మ‌ని కూడా ఉంచాల‌ని ష‌ర‌తు పెట్టార‌ట‌. దానికి ఓకే అన‌డంతో కొల‌త‌లు తీసుకొని టుస్సాడ్స్‌లో విగ్రహం ఆవిష్కరణ చేశారు.

ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి తర‌లించి, ఈ నెల 19 నుండి సింగపూర్‌లోని మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతార‌ని తెలుస్తుంది. గ‌తంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ చేరారు.

ఇవి తప్పక చదవండి

NIRF ర్యాంకింగ్: దిగజారుతున్న హెచ్‌సీయూ ప్రతిష్ఠ

ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి, దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ప్రతిష్ఠ మసకబారుతున్నది. కొన్నేండ్ల పాటు హెచ్‌సీయూ దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొదటిస్థానంలో నిలిచింది. హెచ్‌సీయూలో చదవడం గొప్పగా భావించే...

ట్రంప్ మరో కొత్త నిర్ణయం.. భారతీయులపై ప్రభావం?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారతీయుల ఉద్యోగాలపై బాంబు పేల్చబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, ట్రంప్...

ఎర్రకోట ప్రాంగణంలోని వజ్రాల కలశం అపహరణ

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో జైన మతపరమైన ఆచారంలో భాగంగా ఉపయోగించిన అమూల్యమైన కలశం దొంగతనం జరిగింది. ఈ సంఘటన సెప్టెంబర్ 2న చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. బంగారం, వజ్రాలతో పొదిగిన...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు