Australia ప్రధానమంత్రి Anthony Albanese 2025 మే 3న జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇది ఆయనకు వరుసగా రెండవ 3 సంవత్సరాల పదవీకాలం. గత 21 సంవత్సరాలలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మొదటి Labour Party నాయకుడిగా నిలిచారు .
ఎన్నికల ఫలితాలు
labour Party 76 సీట్లకు అవసరమైన మెజారిటీని దాటి, సుమారు 83 సీట్లు సాధించింది. ఇది గత ఎన్నికల కంటే మెరుగైన ప్రదర్శన. ఇతర ప్రధాన పార్టీ అయిన Liberal-National Coalition కేవలం 41 సీట్లతో పరిమితమైంది. విపక్ష నాయకుడు Peter Dutton తన సీటును కూడా కోల్పోయారు .
ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు:
ఉద్యోగ భద్రత, జీవన ఖర్చులు: ప్రజలు పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు.
శక్తి విధానాలు: లేబర్ పార్టీ renewable energyని ప్రోత్సహించగా, Dutton nuclear energyని ప్రతిపాదించారు.
సామాజిక సేవలు: చైల్డ్‌కేర్, ఆరోగ్య సంరక్షణ, తక్కువ ఆదాయం గల వర్గాలకు మద్దతు వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి.
అంతర్జాతీయ ప్రతిస్పందన
అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubio, Brittain ప్రధాని Keir Starmer సహా అనేక అంతర్జాతీయ నాయకులు Albaneseకు అభినందనలు తెలిపారు. ఇది Australiaతో బలమైన సంబంధాలను సూచిస్తుంది.
రాజకీయ ప్రభావం
ఈ విజయం Albaneseకు రాజకీయంగా బలాన్ని ఇచ్చింది. అయితే, ఆర్థిక సమస్యలు, జీవన ఖర్చులపై ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. Labour Partyకి ఇది ఒక సవాల్‌గా మారవచ్చు.
ప్రధానమంత్రి ప్రసంగం
విజయం అనంతరం ఆల్బనీస్ తన ప్రేయసి Jodey Haydonకు కృతజ్ఞతలు తెలిపారు. Australiansకు న్యాయం, సమానత్వం, ఐక్యతపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.