Author: britishtelugujournal

కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని రేపు(ఆదివారం, జులై20) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నది. ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ (Congress MP Jairam Ramesh) స్పందించారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్‌లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు ఎంపీ జైరాం రమేష్. బిహార్‌లో ఓట్ల రద్దు, పహల్‌గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతామని ఎంపీ జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. మే 10వ తేదీ నుంచి నేటి వరకు డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు పహల్‌గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడారని గుర్తుచేశారు. భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, భారత్ – పాకిస్థాన్…

Read More

వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్‌ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్‌ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్‌ యూనివర్సిటీగా మారాయి. ఫాదర్‌ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్‌ఎంసీ…

Read More

భారత విమానయాన సంస్థలు నడిపే విమానాల కోసం పాకిస్తాన్ తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు మరో నెల రోజులు పొడిగించిందని పాకిస్తాన్ విమానాశ్రయ అథారిటీ తెలిపింది. శుక్రవారం భారత సమయం ప్రకారం మధ్యాహ్నం 3:50 గంటలకు అమల్లోకి వచ్చిన ప్రకారం, భారత విమానయాన సంస్థలు నడిపే ఏ విమానాలు లేదా భారతదేశ యాజమాన్యంలోని లేదా లీజుకు తీసుకున్న సైనిక మరియు పౌర విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడానికి అనుమతించబడవు. ఆగస్టు 24 ఉదయం 5:19 గంటల వరకు (భారత సమయం) ఈ నిషేధం అమలులో ఉంటుందని పిఎఎ తెలిపింది. ఏప్రిల్ 22న 26 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలలో భాగంగా ఏప్రిల్ 30న మొదట నిషేధం విధించిన తర్వాత జూలై 24 వరకు అన్ని పాకిస్తాన్ విమానాలకు భారత వైమానిక ప్రాంతం మూసివేయబడింది. ఏప్రిల్ 24న…

Read More

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్ క్యాంపస్‌లోని తన హాస్టల్ గదిలో బీటెక్‌లో నాల్గవ సంవత్సరం విద్యార్థి శుక్రవారం ఉరివేసుకుని కనిపించాడు, ఈ సంవత్సరం జనవరి నుండి క్యాంపస్‌లో ఇది నాల్గవ అసహజ మరణ కేసు. మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ (21) క్యాంపస్‌లోని రాజేంద్ర ప్రసాద్ (ఆర్‌పీ) హాల్ హాస్టల్ భవనంలోని తన గదిలో ఉరివేసుకుని కనిపించాడని ఇన్‌స్టిట్యూట్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఆ విద్యార్థి గురువారం రాత్రి భోజనం తర్వాత తన గదికి వెళ్లాడని, అతని ప్రవర్తనలో ఎలాంటి అసాధారణత లేదని అతని హాస్టల్ సహచరులలో ఒకరు తెలిపారు. ఐఐటీ కేజీపీ అధికారి మాట్లాడుతూ, అతని తలుపును పదే పదే తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఉదయం, క్యాంపస్‌లోని అవుట్‌పోస్ట్‌లోని పోలీసులు, ఇన్‌స్టిట్యూట్ సెక్యూరిటీ గార్డులతో కలిసి, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తలుపు పగలగొట్టి చూడగా, అతను ఉరివేసుకుని ఉన్నట్లు…

Read More

టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగుల ను తప్పించాలని కొంత కాలంగా డిమాండ్ పెరుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. వారిని తప్పించాలని డిమాండ్ చేసారు. కాగా, వీరి విషయంలో పరిశీలన చేసిన టీటీడీ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారి పైన వేటు వేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవటంతో.. ఇదే తరహా లో ఉన్న మిగిలిన వారి పైన చర్యలు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), శ్రీమతి ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, శ్రీమతి ఎం.ప్రేమావతి, గ్రేడ్-1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ…

Read More

పదేళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌ పేపర్‌లో హెడ్‌లైన్స్‌గా వచ్చాయి.దీన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. పేపర్ కటింగ్స్‌ను షేర్ చేస్తూ రేవంత్ కామెంట్స్‌ను ఖండించారు. కాంగ్రెస్‌లో ఇలాంటి విధానాలు ఉండబోవని అన్నారు. తనకు తానుగా రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. ఆయన ఎక్స్‌లలో ఏమన్నారంటే”రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు.” అని హెచ్చరించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుపడుతున్నారు. పాలమూరు బిడ్డ అయిన…

Read More

ఆర్టీసీ ఉద్యోగులు తమ సౌలభ్యం కోసం క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌)ని ఏర్పాటు చేసుకున్నారు. శాలరీ బేసిక్‌లో ప్రతి నెలా 4.5 శాతం నగదును అందులో పొదుపు చేస్తున్నారు. వారి శాలరీలోంచి ఈ మొత్తాన్ని మినహాయించి, సీసీఎస్‌ ఖాతాలో జమ చేయాల్సిన ఆర్టీసీ యాజమాన్యం, ఆర్థిక ఇబ్బందుల పేరుతో తన అవసరాలకు వాడుకోవడం వల్ల సమస్య ఉత్పన్నమయింది. ప్రస్తుతం క్రెడిట్​ కోపరేటివ్ సంఘంలో 30,653 మంది ఉద్యోగులు, 9,795 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు మెంబర్స్​గా ఉన్నారు. రూ.150 కోట్ల లోన్ పూచీకత్తు అడిగిన బ్యాంకు : నెలనెలా కొంత మొత్తం చొప్పున కొన్ని సంవత్సరాలుగా దాచుకున్న సొమ్మును ఆర్టీసీ తిరిగివ్వక సంస్థ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పట్లో డబ్బులివ్వలేమని, ఎక్కడైనా రుణం తీసుకుని అవసరాలు తీర్చుకోవాలంటూ యాజమాన్యం సలహా ఇచ్చింది. ఎట్టకేలకు ఓ బ్యాంకు క్రెడిట్​ కోపరేటివ్ సొసైటీకి రూ.150 కోట్ల రుణమిచ్చేందుకు ముందుకు వచ్చింది. పూచీకత్తు సమర్పించాలని బ్యాంకు…

Read More

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్‌, భార‌త్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో అయిదు యుద్ధ విమానాలు కూలిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. రిప‌బ్లిక‌న్ ప్ర‌తినిధుల‌తో జ‌రిగిన డిన్న‌ర్ భేటీలో ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయాన‌న్న విష‌యాన్ని మాత్రం ఆయ‌న స్ప‌ష్టం చేయ‌లేదు. ఇది న‌మ్మ‌లేరు, గాలిలోనే విమానాల‌ను పేల్చేశారు. అయిదో నాలుగో.. నాకు తెలిసి అయిదు యుద్ధ విమానాల‌ను కూల్చేశార‌ని ట్రంప్ ఆ మీటింగ్‌లో అన్నారు

Read More

విడాకుల అంశంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. భార్య నుంచి విడాకులు కోరడానికి ఈ కారణాలును చూపించవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 2013లో వివాహం చేసుకున్న ఒక జంట ఆ తర్వాత సంవత్సరం నుంచి విడివిడిగా జీవిస్తోంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను వేధిస్తోందని, అందరి ముందు అవమానిస్తూ మానసిక వేదనకు గురి చేస్తోందని భర్త ఆరోపించారు. భార్య పుట్టింటికి వెళ్ళినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 2015లో పుణేలోని ఫ్యామిలీ కోర్టును విడాకుల కోసం ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం విడాకులకు అనుమతించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది.…

Read More

రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న భారత్‌-కెనడా సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరు దేశాలు హైకమినర్లను నియమించే పనిలో ఉన్నాయని వెల్లడించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘జీ7 సదస్సు సందర్భంగా కెనానాస్కిస్​లో ప్రధాని స్థాయిలో సమావేశం జరిగింది. అక్కడు ఇరు దేశాల నేతలు భారత- కెనడా సంబంధాల ప్రాముఖ్యతను, మళ్లీ పునరుద్ధరించే విషయంపై చర్చించారు. అందుకోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రాజధానుల్లో హైకమిషనర్ల నియామకంపై కూడా కృషి కొనసాగుతోంది. భారత్-కెనడా సంబంధాల్లో వచ్చిన ఈ మార్పుపై సానుకూలంగా ఉన్నాం’ అని అన్నారు. గతనెల జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్​ కార్నీ భేటీ అనంతరం విదేశాంగ శాఖ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశామని జైస్వాల్ గుర్తు చేశారు.’ జీ7 సందర్భంగా కెనడా, భారత్ ప్రధానుల మధ్య…

Read More