బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ గురువారం వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని విస్తృతంగా భావిస్తున్నారు, ఈ సంవత్సరం చివరిలో మరింత తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 4.5% నుండి 4.25%కి కోత విధించే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు, అయితే ఎటువంటి మార్పు లేదా పెద్ద మొత్తంలో తగ్గింపుకు అవకాశాలు లేవు. దీని వాలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మరియు వ్యక్తులు తక్కువ ఖర్చుతో రుణాలు తీసుకోవొచ్చు. కాని పొదుపుదారులకు తక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది.
VE దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు నిమిషాల మౌనం పాటించిన తర్వాత, BST 12:02 గంటలకు ఈ ప్రకటన వెలువడుతుంది. ఒకవేళ కోత నిర్ధారించబడితే, గత సంవత్సరం గరిష్ట స్థాయి 5.25% నుండి ఇది నాల్గవ రేటు తగ్గింపు అవుతుంది మరియు ఈ సంవత్సరం రెండవది అవుతుంది.
ద్రవ్యోల్బణం ఆధారంగా లెక్కించబడిన UK లో ధరల పెరుగుదల రేటుపై బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సభ్యులు నిశితంగా దృష్టి పెడతారు. వార్షిక ద్రవ్యోల్బణ రేటు 2% లక్ష్యం వద్ద లేదా దగ్గరగా ఉండేలా చూసుకోవడంలో వడ్డీ రేట్లు బ్యాంకు యొక్క ప్రాథమిక లక్ష్యం.
తాజా డేటా గమనిస్తే మార్చితో ముగిసిన 12 నెలల్లో ద్రవ్యోల్బణ రేటు 2.6% గా ఉంది, అయితే ఏప్రిల్ ప్రారంభంలో వరుస బిల్లు పెరుగుదల – దేశీయ ఇంధన ధరలు కూడా – రేటు పెరుగుతుందని అంచనా ఇది బహుశా తాత్కాలికంగా మాత్రమే.
ఈ కమిటీ విస్తృత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పట్ల కూడా అప్రమత్తంగా ఉంటుంది. మార్చిలో జరిగిన MPC చివరి సమావేశం తర్వాత అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధానాన్ని ఆవిష్కరించారు.ఈ విధానంలో అస్థిరత మరియు అనిశ్చితి వృద్ధి మరియు ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు, దీని వలన MPC ఈ సంవత్సరం మరిన్ని వడ్డీ రేట్ల కోతలతో స్పందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.