Walden Book by Henry David Thoreau
రచయిత Henry David Thoreau రెండు సంవత్సరాల పాటు, సొసైటీకి, జనావాసాలకి దూరంగా వాల్డెన్ పాండ్ లో ఎవరిపైనా ఆధారపడకుండా అతి సాధారణ జీవితం గడుపుతాడు. నాగరికతకు దూరంగా జీవన విధానాన్ని అనుభవించడం కోసం ఇది ఎక్స్పెరిమెంటల్ గా, తాత్కాలికంగా చేస్తున్నట్టు రచయిత ముందుగానే చెప్తాడు. కేవలం సొసైటీలో మాత్రమే బ్రతక్కగలము, లేకపోతే లేదు అని ఉన్న ఆలోచనా విధానం సరికాదని రచయిత ఈ ప్రయత్నాన్ని వాల్డెన్ పాండ్ ప్రాజెక్ట్ గా చెప్తాడు.
ఇందుకు టౌన్ లో ఉంటున్న ప్రజల నుండి స్కెప్టిసిజమ్ కి, వాళ్ళ ఆశ్చర్యానికి రచయిత ఆసక్తి చూపిస్తూ, తనని తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాంఘీక జీవనవిధానానికి భిన్నంగా, ఇండివిడ్యువలిజం ఫ్రాముఖ్యతను నొక్కి చెప్తూ, వాల్డెన్ పాండ్ ప్రాజెక్ట్ యొక్క ఎకానమీ డాటాను రూపొందిస్తాడు. అక్కడ ఆ వాల్డెన్ పాండ్ కొలను దగ్గర నివాసం ఉండడానికి తను ఎదుర్కొన్న సమస్యలను, ప్రాక్టికల్ సలహాలను, ఇండివిడ్యువలిజంకి ప్రాధాన్యతనిచ్చే గొప్ప ఉపాయాలను ఒకచోట పొందుపరుస్తూ ఉంటాడు.
అక్కడ ఉండటానికి ఏర్పరుచున్న చిన్న కాబిన్, 1845లో వసంతఋతువులో జూలై 4వ తేదీన పూర్తయినట్టు చెప్తాడు. ఆ కాబిన్ నిర్మించటానికి ఉపయోగించిన వస్తువులన్నిటిలోనూ పెద్దమొత్తం, అంతకుముందు ఉన్న ప్రదేశాలనుండి తెచ్చుకున్నవి. ఆ నివాస స్థలం తన స్నేహితుడు Ralph Waldo Emerson(మరో గొప్ప ఆంగ్ల రచయిత)ది. ఇంకా అదనంగా అవుతున్న ఖర్చులకు ఒక కాస్ట్ – అనాలసిస్ చేస్తాడు రచయిత. కొంత డబ్బు సంపాదించటం కోసం, తన కాబిన్ కి దగ్గర్లోనే బీన్స్ సాగు చేస్తాడు. ఈ పంటతో ప్రతిరోజూ అతని ఉదయాలు గడిచిపోతాయి. ఇక మధ్యాహ్నాలూ, సాయంత్రాలు – సెల్ఫ్ కాంటెమ్ప్లేషన్, పుస్తకాలు చదవటం, అక్కడి అడవీ పరిసరప్రాంతాలలో తిరగటం, అక్కడి కొలనులవెంట నడవటం చేస్తూ ఉంటాడు. అక్కడి పరిస్థితులయొక్క కఠినత్వాన్ని, సాధారణ జీవితాన్నీ, ఏకాంతాన్నీ మనకు తెలియపరుస్తూ – మినిమలిజం యొక్క ప్రాముఖ్యతను చెప్తాడు.
పూర్తిగా ఈ ఐసొలేషన్ మాత్రమే కాకుండా, తన చుట్టూ ఉన్న జనారణ్యాన్ని కూడా అనుభూతి చెందుతుంటాడు. వాల్డెన్ పాండ్ దగ్గరనుంచి వెళ్ళే రైలు శబ్దాలు సాంకేతికత కాంటేమ్ప్లేషన్ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు భిన్నమైన వ్యక్తులు కూడా కలుస్తూ ఉంటారు. ఒక పీనట్స్ సాగు చేసే రైతు కలిసినపుడు, తన బీన్స్ పంటను బాగా పండించడానికి సలహాలు అడుగుతాడు. వీటి సాగుల గురించి చర్చిస్తాడు. మరో వ్యక్తి – ఒక రైల్ రోడ్ వర్కర్, అతను తరచూ వాల్డెన్ పాండ్ కి వచ్చి రచయిత కాబిన్ ని సందర్శిస్తూ ఉంటాడు.
Thoroeu తరచూ వాల్డెన్ పాండ్ కి దగ్గరలోని ఒక టౌన్, కాంకర్డ్ కి వెళ్ళి వస్తూ ఉంటాడు. వెళ్ళిన ప్రతిసారీ, సొసైటీలో ఏ వ్యాపారం ఎక్కువగా నడుస్తోందీ, ఏ వస్తువులకి మార్కెట్లో డిమాండ్ ఉందీ అనే విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు. అలా ఒకసారి టౌన్ కి వెళ్ళినపుడు, అక్కడ ఒక టాక్స్ కట్టాల్సి వస్తుంది. అందుకు రచయిత తిరస్కరిస్తాడు, ప్రభుత్వం ప్రజలనుండి టాక్స్ ల రూపంలో దోపిడీ చేస్తున్నదని వాదించినందుకు ఒక రాత్రి జైలులో ఉండవలసి వస్తుంది. మరుసటి రోజు విడుదలయి, వాల్డెన్ పాండ్ కి తిరిగొచ్చేస్తాడు రచయిత.
Thoroeu అక్కడ ప్రతీక్షణం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏకాంతంలోని అధ్భుతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. ప్రకృతిలోని ఋతువులు, ఉదయం – సాయంత్రం యొక్క మార్పులనీ, అక్కడ తనతోపాటు చెట్లలో జీవనం సాగిస్తున్న జీవజాలాన్నీ, జంతువుల శరీర కవచాలనూ, పక్షులు నివాసం కోసం వాటి ముక్కుతో చెట్లకి చేసే తొర్రలనీ, నీటి ప్రవాహాన్నీ గమనిస్తూ ఉంటాడు. వాటన్నిటికీ అర్థాలను తనకుతానే చెప్పుకుంటూ, వాటి తత్త్వాలనూ, సైకలాజికల్ గా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఒకవిధమైన కూత పక్షి రచయితతో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటుంది. అందులోని ప్లే ఫుల్ నెస్ ని, మనిషి ఆనందం కోసం చేసే ప్రయత్నాలనూ – ఆ పక్షికోణంలో చూస్తూ గ్రహిస్తాడు. ఆహారం కోసం చీమలు చేసే పోరాటాన్ని, మనుషులు అధికారం కోసం, ఆధిపత్యం కోసం చేసే యుద్ధాలుగా భావిస్తాడు.
ఇలా animal symbolism రచయితని ఆలోచనలో పడేస్తూ ఉంటుంది. జంతువులని ఒక నేచురలిస్ట్ గా, జంతు శాస్త్రజ్ఞుడిగా కాకుండా – తటస్థంగా, శాస్త్రీయంగా కాకుండా – వాటికి ఒక నీతివంతమైన, తాత్త్విక ఫ్రాధాన్యత అర్థాలు ఇస్తూ ఉంటాడు. ప్రతి జీవజాతి నుండి – ఏదో నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నట్లుగా భావిస్తాడు.
అలా వేసవి నుండి, చలికాలంగా మారుతున్నపుడు – చలిని ఎదుర్కోవటానికీ ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆహారం కోసం ఉడుతల, కుందేళ్ళ, నక్కల ప్రయత్నాన్ని చూస్తాడు. పక్షులు ఒక ప్రాంతం నుండి, మరో ప్రాంతానికి వలసలు చేయడాన్ని గమనిస్తాడు. తన చిన్న కాబిన్ లో చెద పురుగులను ఆహ్వానిస్తూ, ఇతర జీవులనుండి వాటిని రక్షించుకునే ప్రయత్నాన్ని ఆసక్తిగా గమనిస్తాడు. తన కాబిన్ లోకి గాలి ప్రవేశించకుండా, ఒక ప్లాస్టర్ తో గోడలని సిద్ధం చేసి ఉంటాడు. వాల్డెన్ పాండ్ లోని నీలి మంచుని చూసి ఆశ్చర్యపోతూ, రాత్రి సమయంలో – కొలను తీరాన కూర్చుని, గాలి చేసే శబ్దాలను వింటూ తన్మయత్వం చెందుతాడు రచయిత.
అప్పుడప్పుడు అక్కడికి వచ్చే – ఒక ఐస్ కట్టర్, పట్టణంలోని అవసరాలకు ఐస్ తీసుకెళ్ళటాన్ని చూసి, ఇలాగే కదా మంచు కరిగిపోయి, వాల్డెన్ పాండ్ లోకి నీరు బాగా వచ్చి చేరుతుంది అనుకుంటాడు. అప్పుడప్పుడు తన ఇతర స్నేహితులు వచ్చి వెడుతున్నప్పటికీ, అక్కడ ఎక్కువ కాలం తనతోతానే ఒంటరిగా, ఏకాంత జీవనం గడుపుతూ ఉంటాడు.
వాల్డెన్ పాండ్ లో – అంతకు ముందు, పేద వాణిజ్యపరులు, బానిసలు, సంచారరైతులు ఉండేవారు. వాళ్ళు అక్కడే చనిపోయి, ఇతర ప్రపంచంచేత మరచిపోబడ్డారు. కొన్నిసార్లు వాళ్ళు కనిపించినట్టు భావించి భయానికి గురవుతూ ఉంటాడు. అయినా ధనవంతుల మధ్యకంటే, అలాంటి వ్యక్తులమధ్యే ఉండటానికి ఇష్టపడేవాడు.
వాల్డెన్ కొలనుతో, ఇతర కొలనులతో ఉండటంవల్ల – వాటి కొలతలను, లోతులను మ్యాప్ వేసేవాడు. ఈ పాండ్ ని ఒక సింబల్ గా భావించి, అక్కడ ధ్యానించేవాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ఒక సింబల్ ఆఫ్ లైఫ్ మీనింగ్ ఒకటి ఉండాలని Thoroeu భావించేవాడు. అలా చలినుండి మరలా వేసవి కాలంలో మంచు మరింత కరిగి, వాల్డెన్ పాండ్ ఉధృతి పెరిగి, నీరు అక్కడి తీరాన్ని తాకుతూ ఉండేది.
అలా Thoroeu, సెప్టెంబర్ 6, 1847 న – తిరిగి నాగరిక జీవనంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటిస్తాడు. ఇలా మనల్ని మనం కలుసుకోవడానికి, జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ, పరిపూర్ణంగా జీవించడం గురించి ఈ పుస్తకం చెబుతుంది.


