మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవప్రదమైన గుర్తింపు! రేపు (19వ తేదీ) Bridge India అనే Non-Profit Organization ఆయనకు UK Parliament House of Commons buiding లో Life time Achievement Award ప్రదానం చేయనుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఇప్పటికే London చేరుకున్నారు, అక్కడ London Heathrow విమానాశ్రయంలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కళారంగంలో చేసిన అపూర్వమైన సేవలకు, సినీరంగంలో ఆయన అందించిన అజరామరమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయబడుతోంది.
ఇప్పటికే చిరంజీవి భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం Padma Vibhushan స్వీకరించగా, అంతకుముందు Padma Bhushan కూడా అందుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన Dance విభాగంలో Guinness Book of World Records నుండి ప్రత్యేక సర్టిఫికేట్ పొందారు. నాలుగున్నర దశాబ్దాల Cinema ప్రస్థానంలో చిరంజీవి చూపించిన ప్రభావం, ప్రజాదరణ, Charisma – ఇవన్నీ ఆయన గొప్పతనాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.
నటుడిగా మాత్రమే కాకుండా, మానవతా పరమైన సేవల్లోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన Chiranjeevi Blood & Eye Bank ద్వారా వేలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. Blood Donation, Eye Donation వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి, మరెందరికో కొత్త ఆశను అందించారు.
ఈ గుర్తింపు చిరంజీవిగారికి మరిన్ని బాధ్యతాయుతమైన పాత్రలు, అలాగే భవిష్యత్తులో మరింత సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రేరణ ఎటువంటి సందేహం లేదు.