Wednesday, 3 September 2025

శ్రీదేవి ఆస్తిని కబ్జా చేశారు.. కోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్‌

తన భార్య, దివంగత నటి శ్రీదేవి ఆస్తిని ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారంటూ బోనీ కపూర్‌ కోర్టును ఆశ్రయించారు. వారు చట్టవిరుద్ధంగా హక్కులను సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఆమె ఎంతో కష్టపడి ఆ స్థిరాస్తిని కొనుగోలు చేసిందని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దాని వివరాలను కోర్టుకు వివరించారు. ఈ ఆస్తి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) ప్రాంతంలో ఉంది. దీన్ని శ్రీదేవి కుటుంబం ఫామ్‌హౌస్‌గా ఉపయోగిస్తోంది.

1988 ఏప్రిల్ 19న శ్రీదేవి మద్రాసులో ఎంసీ సంబంద మొదలియార్‌ అనే వ్యక్తి వద్ద స్థిరాస్తిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పత్రాలన్నీ పరిశీలించిన తర్వాతే ఆమె దాన్ని కొనుగోలు చేసినట్లు బోనీ కపూర్‌ తెలిపారు. అతడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వారందరి దగ్గర వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తర్వాతనే శ్రీదేవి ఈ ఆస్తిని సొంతం చేసుకున్నట్లు బోనీ కపూర్‌ వెల్లడించారు. మొదలియార్ కుటుంబం 1960 ఫిబ్రవరి 14న ఆస్తిని మధ్యస్థత ద్వారా విభజించుకుంది, ఇది శ్రీదేవి కొనుగోలుకు మార్గం సుగమం చేసింది. అయితే, ఎంసీ సంబంద మొదలియార్‌ కుమారుడు చంద్రశేఖరన్ మొదలియార్ రెండో భార్య, ఆమె ఇద్దరు కుమారులు ఈ ఆస్తిలో వారికి వాటా ఉందంటూ 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయంలో చట్టపరమైన వారసత్వ ధ్రువీకరణ పత్రం పొందారు. ఈ మహిళ 1975 ఫిబ్రవరి 5న చంద్రశేఖరన్‌తో వివాహం చేసుకుందని చెప్పుకుంది, కానీ అతని మొదటి భార్య 1999 జూన్ 24 వరకు బతికి ఉందని బోనీ వాదనలో పేర్కొన్నారు. దీంతో ఈ వివాహం చట్టవిరుద్ధమని, వారు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం క్లాస్ I లేదా క్లాస్ II వారసులు కాదని ఆరోపించారు. మొదలియార్ కుటుంబం మైలాపూర్‌లో నివసించింది కాబట్టి తాంబరం తహసీల్దార్‌కు ఈ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం లేదని కూడా బోనీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వ అధికారుల నిర్ణయంతో తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కులను సొంతం చేసుకున్నారని బోనీ కపూర్‌ హైకోర్టులో కేసు వేశారు. మోసపూరితమైన పత్రాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన భార్య బతికి ఉండగానే మొదలియార్‌ రెండో వివాహం చేసుకున్నారన్న విషయాన్నీ బోనీ కపూర్‌ ప్రస్తావించారు. ఈ ముగ్గురు వ్యక్తులు పలు సివిల్ కేసులు, రెవెన్యూ అధికారుల వద్ద అప్పీల్‌లు చేసి బోనీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. విచారించిన జస్టిస్‌ ఎన్. ఆనంద్ వెంకటేశ్ నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని.. ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తాంబరం తాలూకా తహసీల్దార్‌ను ఆదేశించారు. ఏప్రిల్ 22, 2025న బోనీ చేసిన ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని చెంగల్పట్టు కలెక్టర్, తాంబరం తహసీల్దార్‌లకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

1996లో బోనీ కపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు (జాన్వీ కపూర్‌, ఖుషి కపూర్‌). 2018లో శ్రీదేవి మరణించారు. ఈ ఆస్తి కుటుంబానికి భావోద్వేగ స్థానంగా ఉంది, శ్రీదేవి మరణం తర్వాత కూడా జాన్వీ, ఖుషి కపూర్‌లు దీన్ని ఫామ్‌హౌస్‌గా ఉపయోగిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు