ఇందౌర్‌లో ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ నిబంధన ఉల్లంఘన కారణంగా ఒక పెట్రోల్ బంక్‌ను సీజ్ చేశారు. ఓ పాల విక్రేత హెల్మెట్‌కు బదులు పాల క్యాన్ మూతను తలపై పెట్టుకొని ఇంధనం నింపుకున్నాడు, దీనిని బంక్ సిబ్బంది పట్టించుకోకుండా పెట్రోల్ సరఫరా చేశారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టి, నిబంధనలు అతిక్రమించినందుకు బంక్‌ను సీజ్ చేశారు.
ఆగస్టు 1, 2025 నుంచి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకూడదనే నిబంధన ఇందౌర్‌లో అమలులో ఉంది. దీని ప్రకారం హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు ఇంధనం నిరాకరించాలి. ఐతే ఆ నిబంధనని పట్టించుకోకుండా నెత్తి మీద పాల క్యాన్ మూత పెట్టుకొని వుండగా పాల విక్రేతకి పెట్రోల్ పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో అప్రమత్తమైన అధికారులు బంక్ ని సీజ్ చేశారు. ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష, రూ.5,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.


