Wednesday, 25 March 2026

ఉత్తర అరిజోనాలోని కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి

ఉత్తర అరిజోనాలోని నవాజో నేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒక వైద్య రవాణా విమానం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో నలుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. చిన్లే మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. విమానంలో ముగ్గురు వైద్య సిబ్బంది ఒక పేషెంట్‌ను తీసుకెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. అయితే, ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన CSI ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈ విమానం, ఫీనిక్స్‌కు ఈశాన్యంగా 300 మైళ్లు (483 కిలోమీటర్లు) దూరంలో ఉన్న చిన్లేలోని విమానాశ్రయానికి సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. చిన్లే విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఒక తెలిపారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో దురదృష్టవశాత్తు ఏదో తప్పు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని జిల్లా పోలీసు కమాండర్ ఎమ్మెట్ యాజ్జీ వెల్లడించారు. ఈ ఘటనపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, FAA దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.

ఈ విషయంపై నవజో నేషన్ అధ్యక్షుడు బుయు నైగ్రెన్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధకారమన్నారు. కాగా, జనవరిలో ఫిలడెల్ఫియాలో ఒక వైద్య రవాణా విమానం కూలిపోయి ఎనిమిది మంది మరణించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఆ విమానంలోని వాయిస్ రికార్డర్ పనిచేయడం లేదని తెలిపింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు