Wednesday, 18 March 2026

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష

బాలకపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ చార్జ్ జడ్జి రోజారమణి తీర్పు ఇచ్చారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో మహమ్మద్ ఖయ్యూం అనే వ్యక్తిపై కేసు నమోదైంది. 2022 నుండి కోర్టులో వాదనలు కొనసాగగా నేడు తుది తీర్పు వెలువడింది.

సాధారణంగా పోక్సో కేసుల్లో 10–20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. కానీ ఈ కేసులో 50 ఏళ్ల శిక్ష విధించడం చాలా అరుదు. దీని వల్ల నిందితుడు దాదాపు జీవితకాలం జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఇది బాలలపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా కోర్టు తీసుకున్న కఠినమైన చర్యగా పరిగణించబడుతోంది. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలనుకునే వారిపై భయం కలిగించేలా ఉంటాయి.

సమాజంలో బాలల భద్రతకు న్యాయవ్యవస్థ ఇచ్చిన గట్టి హామీగా ఇది నిలుస్తుంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు