Saturday, 21 March 2026

తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ… మధ్యలో వెళ్లిన ఎస్సై దారుణ హత్య

తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో తండ్రి మూర్తి మరియు కుమారుడు తంగపాండి మధ్య మంగళవారం రాత్రి మద్యం మత్తులో జరిగిన గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ప్రత్యేక ఎస్సై షణ్ముగవేల్ (57) దారుణ హత్యకు గురయ్యారు.

తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ సమాచారం అందుకున్న షణ్ముగవేల్ మరియు ఓ కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకుని, గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. షణ్ముగవేల్ ఫొటోలు తీసే ప్రయత్నంలో ఉండగా, మూర్తి మరో కుమారుడు మణికంఠన్ కత్తితో దాడి చేసి, షణ్ముగవేల్‌ను హత్య చేశాడు. కానిస్టేబుల్‌కు గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు మూర్తి, మణికంఠన్‌ను అరెస్టు చేసి, తంగపాండి కోసం గాలిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు