Wednesday, 25 March 2026

TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో AI ప్రభావంపై సర్వే

TCS సంస్థ 12,000 ఉద్యోగాలను తొలగించనున్న నేపథ్యంలో,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ విభాగంపై ఎలా ప్రభావం చూపిస్తోందో తెలుసుకునేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వేను నెల రోజుల్లోపు పూర్తి చేస్తామని మంగళవారం రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా టెక్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వేళ TCS నిర్ణయం మరోసారి షాక్ ఇచ్చినట్లైంది. TCSపై చర్యలు తీసుకోవాలని కోరిన కర్ణాటక IT/ITeS ఉద్యోగుల యూనియన్ అభ్యర్థనపై స్పందించిన ఖర్గే,”రాష్ట్రం IT రంగంలో యూనియన్లను అధికారికంగా గుర్తించదు. కానీ ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి ఎలాంటి ఆందోళనలు వస్తే, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మనదే” అని అన్నారు.

బెంగళూరులోని SAP Labs India కార్యక్రమం సందర్భంగా PTIతో మాట్లాడిన ఖర్గే, “AI వల్ల ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాలని కంపెనీలతో కలిసి సర్వే చేస్తున్నాం. మన హ్యూమన్ రిసోర్స్‌ ఎక్కువగా ఉద్యోగయోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలో కంపెనీల అభిప్రాయాలు సేకరిస్తున్నాం” అన్నారు. ఈ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. FY26 మొదటి త్రైమాసికంలో భారతదేశం టాప్‌ ఐటీ కంపెనీలు సింగిల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్‌ మాత్రమే నమోదు చేయడం, తీరా AI ప్రభావంపై చర్చను మరింత కీలకం చేసింది. ఈ మందకొడితనానికి కారణంగా క్లయింట్ల నిర్ణయాల్లో జాప్యం, ఆర్థిక అస్థిరతలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

TCS చేపట్టిన ఉద్యోగాల తొలగింపు ఒక్కసారిగా జరిగిన నిర్ణయం కాదు. సంస్థ చెప్పినదాని ప్రకారం, ఇది సంస్థను భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా చేయడానికి తీసుకున్న వ్యూహాత్మక చర్య. కొత్త సాంకేతికతలలో పెట్టుబడి పెడుతూ, AI వంటివాటిని ఉపయోగించి వర్క్‌ఫోర్స్‌ను రియలైన్ చేస్తున్నామంటోంది. ఈ చర్య వల్ల గ్లోబల్‌గా దాదాపు 2% ఉద్యోగులపై, ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఇక సంస్థ MD, CEO కే. కృతివాసన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల డిమాండ్‌ తక్కువగా ఉందని, FY26లో డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ఆశించట్లేదన్నారు. క్లయింట్ల నిర్ణయాల్లో జాప్యం పెరిగిందని, ఆర్థిక పరిస్థితి మెరుగైతే డిస్క్రిష్నరీ స్పెండింగ్ తిరిగి మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలో ఉన్న పరిస్థితి గ్లోబల్ టెక్ రంగానికి ప్రతిబింబమే. మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక్కటే ఈ ఏడాది 15,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. Layoffs.fyi అనే వెబ్‌సైట్‌ ప్రకారం, 2025లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 169 కంపెనీల్లో 80,000 మందికి పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో ఈ సంఖ్య 1.5 లక్షలకు చేరిన సంగతి తెలిసిందే. ఇదంతా గ్లోబల్ ఆర్థిక సమస్యలు, AI వల్ల ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న చర్చల ముప్పు మధ్యనే జరిగింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు