Wednesday, 3 September 2025

ఢిల్లీలో 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

ఢిల్లీలో మ‌ళ్లీ స్కూళ్ల‌(Delhi Schools)కు బెదిరింపులు వ‌చ్చాయి. ఇవాళ సుమారు 50 స్కూళ్ల‌కు మెయిల్ బెదిరింపు చేశారు. పోలీసులు దీన్ని ద్రువీక‌రించారు. టెర్ర‌రైజ‌ర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్ల‌కు మెయిల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. డీఏవీ ప‌బ్లిక్ స్కూల్‌, ఫెయిత్ అకాడ‌మీ, డూన్ ప‌బ్లిక్ స్కూల్‌, స‌ర్వోద‌య విద్యాల‌య‌తో పాటు ఇత‌ర స్కూళ్ల బెదిరింపులు వ‌చ్చాయి. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.

క్రిప్టోక‌రెన్సీ రూపంలో 5వేల డాల‌ర్లు ఇవ్వాలంటూ అదే గ్రూపు ఆగ‌స్టు 18వ తేదీన బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డింది. ప్రిన్సిపాల్స్‌, అడ్మినిస్ట్రేట‌ర్స్‌కు బెదిరింపు గ్యాంగ్ బ‌ల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్ట‌మ్స్‌ను ఉల్లంఘించిన‌ట్లు తెలిపారు. స్కూల్ ఆవ‌ర‌ణ‌ల్లో 48 గంట‌ల్లోగా బాంబులు పేల్చుతామ‌ని మెయిల్‌లో పేర్కొన్నారు. మేం టెర్ర‌రైజ‌ర్స్ 111 గ్రూపుకు చెందిన‌వాళ్ల‌మ‌ని, మీ బిల్డింగ్‌లో పేలుడు ప‌దార్ధాలు అమ‌ర్చామ‌ని, క్లాస్‌రూమ్‌లూ.. ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్‌లు, స్కూల్ బ‌స్సులను శ‌క్తివంత‌మైన సీ4 బాంబుల‌తో పేల్చివేస్తామ‌ని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు