Watford లోని Carpenders Park Lawn స్మశానవాటికలో పిల్లల సమాధి ఫలకాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అక్కడి ముస్లిం సమాజాన్ని కుదిపేసింది.
Watford సమీపంలోని స్మశానవాటికలో ముస్లిం సమాధులను అపవిత్రం చేయడాన్ని కేవలం విధ్వంసక చర్యగా కాకుండా Islamophobic attack గా పరిగణించాలని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.
Watford లోని Carpenders Park Lawn స్మశానవాటికలోని ముస్లిం సమాధుల విభాగంలోని సమాధులు “అవమానకరమైన విధ్వంసక చర్యలకు గురయ్యాయి”, పిల్లలకు సంబంధించిన సమాధి ఫలకాలు కూడా ధ్వంసమయ్యాయని Moor Park, Eastbury కౌన్సిలర్ అబ్బాస్ మెరాలి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనలో నివేదించారు.
“ఈ అసహ్యకరమైన చర్యలు దుఃఖిస్తున్న కుటుంబాలకు తీవ్ర వేదన కలిగించాయి. అంతే కాదు, మా (ఇస్లామిక్) సమాజం అంతటా తీవ్ర బాధను కలిగించాయి” అని మెరాలి అన్నారు.
ఈ సంఘటనను “తీవ్రమైన మరియు లక్ష్యంగా చేసుకున్న విధ్వంసక చర్య” (serious and targetted act of vandalism)గా పరిగణిస్తున్నారని, పూర్తి దర్యాప్తు జరుగుతోందని Hertfordshire పోలీసులతో తాను మాట్లాడానని, ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా చూసేందుకు తాను పోలీసులు, స్థానిక ఎంపీ గగన్ మోహింద్రతో ఫాలో అప్ చేస్తానని కౌన్సిలర్ తెలిపారు.
స్థానిక ముస్లిం అంత్యక్రియల సంరక్షణ సేవ అయిన Wadi Funeral Care, స్మశానవాటికను నిర్వహించే Brent Council ను దాడిపై “సమగ్ర దర్యాప్తు” నిర్వహించాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. “మన ప్రియమైనవారి విశ్రాంతి స్థలాల పవిత్రతను కాపాడాలి” అని ఆ ప్రకటనలో జోడించబడింది.
ఐతే ఒక ముస్లిం స్వచ్ఛంద సంస్థ అధికారుల ప్రతిస్పందన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసింది. దాడి యొక్క ఇస్లామోఫోబిక్ స్వభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని చెప్పింది. “ఇది స్పష్టంగా విధ్వంసక చర్య మాత్రమే కాదు, ఇది ఇస్లామోఫోబిక్ దాడి. దానిని అలాగే నమోదు చేయాలి” అని అన్-నిసా సొసైటీ X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
“బ్రెంట్/హారోలో ఇస్లామోఫోబియా గురించి మేము మాట్లాడుతూనే ఉన్నాము మరియు అయినప్పటికీ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించరు – దుర్వినియోగం, దాడులు & వివక్షత” అని జోడించింది.
Muslim Council of Britain (MCB) సెక్రటరీ జనరల్ జారా మొహమ్మద్ ఈ దాడిని “కలవరపరిచేది”, “నీచమైనది”, “ఇస్లామోఫోబిక్” అని ఖండించారు. ఇది కుటుంబాలకు కలిగించే బాధను నేను ఊహించలేను. నేరస్థులను త్వరగా గుర్తించి న్యాయం చేయాలని నేను ఆశిస్తున్నాను” అని ఆమె Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
ఫిబ్రవరిలో, ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత నేరాలను పర్యవేక్షించే UK Watch Dog అయిన Tell Mama 2024లో దాదాపు 6,000 ముస్లిం వ్యతిరేక సంఘటనల నివేదికలు అందాయని నివేదించింది – ఇది రెండేళ్ల క్రితం సంఖ్య కంటే రెట్టింపు.