ప్రపంచ సుందరి ఎవరు అని తెలుసుకోవాలి అనే కుతూహలం పోయి చాలా కాలం అయింది. దానికి రక రకాల కారణాలు ఉన్నాయి. టెక్నాలజీ, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండే సమాచారం చాలా తక్కువగా ఉండేది. సమాచారం టివి, పేపర్, మాగజైన్ ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉండేది.
మెల్లగా ఇంటర్నెట్ అనేది విస్తృతంగా అందుబాటులోకి రావడం టివి ఛానల్స్ పెరిగిపోవడం వలన సమాచారం ఎక్కువ అయిపోయి ప్రజలు తమకు నచ్చిన సమాచారం ఆధారంగా విడిపోవడం మొదలయింది. ఎవరి నచ్చిన విషయాలను వాళ్ళు పట్టించుకోవడం మిగతా విషయాలను వదిలెయ్యడం అలవాటు అయింది. ఒకప్పుడు టివిలో పేపర్లో చూసిన విషయాలనే చర్చించుకునేవాళ్ళు చెప్పుకునే వాళ్ళు. ఆ విషయాలు పదేపదే ప్రజల మధ్య తిరుగుతుండేవి.
ప్రపంచంలోనే అందమైన అమ్మాయి అనగానే దాని గురించి ఆలోచించడం వార్త కొరకు ఎదురు చూడడం దాని గురించి చర్చించుకోవడం చేశేవాళ్ళు. మెల్లగా సినిమా హీరోయిన్స్ సంఖ్య పెరగడం మొదలయింది. ప్రజలు అందమైన అమ్మాయిలను రక రకాలమార్గాల ద్వారా చూడడం మొదలయింది. ఎప్పుడైతే ఎక్కువ మంది గురించి తెలియడం మొదలయిందో అప్పుడే ఈ మిస్ వరల్డ్ గురించి ఆసక్తి తగ్గిపోయింది. అరచేతిలో అద్భుతమైన అందమైన అమ్మాయిలు కనిపిస్తుంటే ఇంక ప్రపంచ సుందరి గురించి ఆలోచించడం ఎంక్వయిరీ చేయడం గుర్తుపెట్టుకోవడం అనేది ఎవరు పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం తెలంగాణకు ఎదో మేలు జరుగుతుంది అని అనుకున్నది కాని లాభం జరిగినట్లు అయితే కనిపించడం లేదు. ఈ పోటీల గురించి పెద్దగా కవరేజ్ లేదు. పెద్దగా చర్చలు కూడా లేవు. దీనికి తోడు ఆపరేషన్ సింధూర్ కూడా దీన్ని వార్తల్లో లేకుండా చేసింది. దీనికి తోడు ఒక అమ్మాయి మధ్యలోనే వదిలి వెళ్లి లైంగిక వేధింపు ఆరోపణలు చేసింది. ఈ విషయం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే ఇందులో పాల్గొనే వాళ్ళ కాళ్ళు కడగడం గురించి రచ్చ అయింది. దానికి మినిస్టర్స్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ప్రపంచ సుందరి పోటీలు అన్నారు తప్ప ఆ స్థాయిలో ఈవెంట్ నిర్వహణ కనిపించలేదు. ఇండియాలో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరు ఈ ఈవెంట్లో కనిపించలేదు. అలాంటప్పుడు గ్లోబల్ గా తెలంగాణకు కలిగే లాభం కనిపించలేదు. ప్రపంచ సుందరి విజేత గురించి ఒకటి రెండు పేపర్లో మొదటి పేజీలో ఎక్కువ కవర్ చేశారు మిగతా పేపర్లో చిన్నగా ఇంగ్లిష్ పేపర్లో లోపలి పేజిలో ఈ వార్తను వేశారు. అలాగే నేషనల్ న్యూస్ ఛానల్స్ లో కూడా దీని గురించి పెద్దగా కవరేజ్ రాలేదు. ఇలాంటి దాని కోసం కోట్ల రూపాయల ప్రజల డబ్బును ఖర్చు పెట్టడం అనేది సరి అయినది కాదు అనిపిస్తుంది.