ఇంగ్లాండ్‌లో పిల్లలను కొట్టడం పై (smacking) పూర్తి నిషేధాన్ని వైద్యులు సమర్థించారు. బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ (BMA) తాజాగా ఈ నిషేధానికి మద్దతు ప్రకటించింది.
జనవరిలో లేబర్ పార్టీ ఎంపీ జెస్ అసటో ప్రవేశపెట్టిన పిల్లల సంక్షేమం మరియు పాఠశాలల బిల్లు సవరణకు తగినంత మంది ఎంపీలు మద్దతు ఇస్తే, ఇంగ్లాండ్‌లో కొట్టడాన్ని రీసనబుల్ పనిష్మెంట్ గా సమర్థించడం పూర్తిగా నిషేధించబడుతుంది.
నవంబర్ 2020లో కార్పొరల్ పనిష్మెంట్ నిషేధించిన మొదటి UK దేశం స్కాట్లాండ్. ఆ తర్వాత మార్చి 2022లో వేల్స్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు ఇప్పటికే కొట్టటాన్ని నిషేధించాయి. అలాగే మరో 20 దేశాలు అలా చేయడానికి కట్టుబడి ఉన్నాయి. పిల్లలను కొట్టడం వలన పాజిటివ్ దృక్పథం వస్తుంది అనటానికి ఎలాంటి ఆధారలు లేవు, అని RCPCH Royal College of Pediatrics and child Health ప్రొఫెసర్ ఆండ్రూ రోలాండ్ అన్నారు.
పిల్లలను కొట్టడం శారీరక శిక్ష (Physical Punishment) కిందకు వస్తుంది. ఇది మానసిక, భావోద్వేగ, ఆచరణాత్మక సమస్యలను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్కాట్లాండ్, వేల్స్ ఇప్పటికే ఈ విధానాన్ని నిషేధించాయి. ఇంగ్లాండ్‌లో కూడా ఇదే చర్య తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు. ఇది బాలల హక్కుల పరిరక్షణకు మరియు ఆరోగ్యకరమైన పెంపకానికి సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.