హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదంపై CM రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టికెట్లు, ఫ్రీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను వేధిస్తున్నదని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే తాము ఉప్పల్ స్టేడియం వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హెచ్చరించింది. మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల విక్రయం పైనా కొంతకాలంగా HCA పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే CM రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
ఈ వివాదం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలువడే అవకాశముంది.