Friday, 27 February 2026

అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టం ను పరీక్షించిన భారత్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రాన్ని చేర్చింది. దేశ రక్షణ సామర్థ్యాలను కొత్త శిఖరాలకు చేర్చే క్రమంలో శనివారం ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) తొలి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.

ఈ చారిత్రాత్మక విజయంపై డీఆర్‌డీవో శాస్త్రవేత్తలను, భారత సాయుధ దళాలను, పారిశ్రామిక వర్గాలను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. “ఐఏడీడబ్ల్యూఎస్ విజయవంతమైన అభివృద్ధికి కృషి చేసిన డీఆర్‌డీవో, సాయుధ దళాలు, పరిశ్రమలకు నా అభినందనలు. ఈ ప్రత్యేకమైన ప్రయోగ పరీక్ష మన దేశ బహుళస్థాయి గగనతల రక్షణ సామర్థ్యాన్ని రుజువు చేసింది. శత్రువుల వైమానిక దాడుల నుంచి దేశంలోని కీలక ప్రాంతాలకు, ముఖ్యమైన సంస్థలకు ఇది మరింత పటిష్ఠమైన రక్షణ కల్పిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) అనేది ఒకే వ్యవస్థ కాదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బహుళస్థాయి రక్షణ వ్యవస్థ. ఇందులో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్‌శామ్), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీషోరాడ్స్) క్షిపణులతో పాటు అధిక శక్తివంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ కలిసి భారత గగనతలానికి ఒక అభేద్యమైన రక్షణ కవచంగా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు