Wednesday, 3 September 2025

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా భారత ఆర్థిక వృద్ధి

2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో (Q1 FY26) దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. By: A.N.Kumar | 31 Aug 2025 7:00 PM Share: భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. నిపుణులు చెబుతున్నదేమిటంటే, ఆర్థిక వృద్ధి అన్ని అంచనాలను మించి ఉందని. జీడీపీ వృద్ధి రికార్డు స్థాయిలో 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో (Q1 FY26) దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత అంచనాల కంటే చాలా ఎక్కువ. ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ యశ్వీర్ త్యాగి మాట్లాడుతూ “భారత ఆర్థిక వ్యవస్థ చూపిన పనితీరు అంచనాలను మించిపోయింది. 7.8 శాతం వృద్ధి చాలా బలమైన సంకేతం” అని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయం, పరిశ్రమ, సేవల రంగాల బలమైన ప్రదర్శన సౌరాష్ట్ర యూనివర్శిటీకి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ జీ. పరద్వా ప్రకారం.. మంచి వర్షాకాలం కారణంగా వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు.. ఈ మూడు రంగాలు గణనీయంగా వృద్ధి సాధించడమే జీడీపీకి బలాన్నిచ్చిందని ఆయన తెలిపారు. – క్రిసిల్ నివేదిక హెచ్చరిక అయితే క్రిసిల్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా టారిఫ్ పెంపులు వంటి బాహ్య అంశాలు డౌన్‌సైడ్ రిస్క్‌గా మారవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

వినియోగదారుల డిమాండ్ పెరుగుదల ఆదాయం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడం, ద్రవ్యోల్బణం తగ్గడం, వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను రాయితీలు లాంటి కారణాలతో వినియోగదారుల డిమాండ్ గణనీయంగా పెరిగింది. గృహ వినియోగం 6 శాతం నుండి 7 శాతంకి పెరిగింది. ప్రభుత్వ ఖర్చులు కూడా పెరిగి, పెట్టుబడుల వ్యయం బలంగా నమోదైంది. అన్ని రంగాల మద్దతుతో ప్రభుత్వ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. వినియోగదారుల డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో రాబోయే త్రైమాసికాల్లో భారత ఆర్థిక వ్యవస్థ తన వేగాన్ని కొనసాగించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు