ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను భాజపా పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో ప్రకటించారు.
సీపీ రాధాకృష్ణన్, తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు, తమిళనాడు భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఝార్ఖండ్, మహారాష్ట్ర గవర్నర్‌గా, అలాగే తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ.