ఇరానియన్ దర్శకుడు Jafar Panahi రూపొందించిన “It Was Just an Accident” అనే హృద్యమైన డ్రామా, ఈ ఏడాది Cannes చలనచిత్రోత్సవంలో Palme d’Or పురస్కారాన్ని గెలుచుకుంది.
ఈ చిత్రం, ఆయన అనుభవించిన జైలు జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ప్రభుత్వ హింస, న్యాయం, ప్రతిఘటన వంటి అంశాలను ఘాటుగా ప్రదర్శిస్తుంది.
ఇరాన్లో అణిచివేతకు వ్యతిరేకంగా చిత్రాలు తీసినందుకు Jafar Panahi పై పదిహేను సంవత్సరాల ప్రయాణ నిషేధంతో పాటు పలుమార్లు నిర్బంధం విధించబడింది. కానీ ఆయన కళను గుర్తించిన ప్రేక్షకులు ఆయన కోసం చాలాసేపు నిలబడి ఉత్కంఠభరితంగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.
ఈ అవార్డును చాలా మంది రాజకీయ ప్రకటనగా కూడా చూశారు – కేవలం సినిమా నైపుణ్యానికి మాత్రమే కాదు, సాహసానికి ఇచ్చిన గుర్తింపుగా భావించారు.
జ్యూరీ అధ్యక్షురాలు Juliette Binoche మాట్లాడుతూ,
“కళ మనలోని అత్యంత విలువైన, జీవంతో నిండిన శక్తిని మేల్కొల్పుతుంది. ఇది చీకటిని ఆశలోకి, కొత్త జీవనంలోకి మారుస్తుంది” అని అన్నారు.
Jafar Panahi వేదికపైకి వచ్చి, తన ప్రసంగాన్ని ఐక్యత పిలుపుగా మార్చారు:
“మనకు ఏమి ధరించాలి, ఏం చేయాలి చెప్పే హక్కు ఎవరికి లేదు. మనం ఒక్కటై ఎదురు నిలుద్దాం” అని ఉద్ఘాటించారు.
ఈ చిత్రం కథలో, వహీద్ అనే వ్యక్తి తనపై హింస చెలాయించిన వ్యక్తిని కిడ్నాప్ చేస్తాడు. అతని సహచరులు కలిసి, వాస్తవానికి ఇతనేనా తమ జీవితాలను నాశనం చేసినవాడు? నిజమైన న్యాయం సాధ్యమా? అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతారు.
ఈ ఏడాది ఉత్సవం, గాజాలో జరుగుతున్న మారణహోమం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, విదేశీ చిత్రాలపై అమెరికా ప్రతిపాదిస్తున్న సుంకాలు వంటి రాజకీయ సంధర్భాలతో కూడిన చర్చలతో సాగింది.
ఉత్సవ నిర్వాహకుల ప్రకారం, 900కి పైగా కళాకారులు గాజాలో జరుగుతున్న సంఘటనలను “Genocide” గా ఖండిస్తూ ఓపెన్ లెటర్‌పై సంతకాలు చేశారు.