Tuesday, 17 March 2026

ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్ ఇచ్చిన కమిషన్!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని జస్టిస్ పీ.ఎన్.దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్టు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ వెల్లడించారు.

నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధానసౌధలో మీడియాతో మాట్లాడిన మంత్రి పాటిల్ ఈ వివరాలను వెల్లడించారు. “జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ కమిషన్ రెండు భాగాలుగా తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ముడా కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ నివేదికను యథాతథంగా ఆమోదించింది” అని ఆయన వివరించారు.

ముడా అక్రమంగా 14 స్థలాలను సీఎం కుటుంబానికి కేటాయించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రధాన నిందితుడిగా, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జునస్వామిని ఇతర నిందితులుగా పేర్కొన్నారు. గతంలో కర్ణాటక లోకాయుక్త కూడా సరైన ఆధారాలు లేవని ఈ కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

డీ-నోటిఫై చేసిన భూములను ముడా వినియోగించుకున్నందుకు పరిహారంగానే భూ యజమానులకు నిబంధనల ప్రకారం స్థలాలు కేటాయించారని, ఈ ప్రక్రియలో ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే, మరోవైపు కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు