దేశానికి ఒక జాతీయభాష ఉండాల్సిన అవసరం లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం అద్భుతంగా పురోగమిస్తుంది. ప్రతి 250 కిలోమీటర్లకు మనదేశంలో భాషా, సంస్కృతి ,ఆహారం, వేషభాషలు మారుతాయి. ఈ విషయంలో యూరప్ నకు ఇండియాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా మనం ఇంకా కలిసే ఉన్నాము. జాతీయ భాష చేస్తే తక్కువ ప్రజలు మాట్లాడే భాషలు కాలక్రమంలో కనుమరుగు అవుతాయి. చాలా దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు. ఇంగ్లీష్ తోనే అవకాశాలు లభిస్తాయి. హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్తే ప్రయోజనం ఉంటుందా ’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
జైపూర్ లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9 వ ఎడిషన్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గ పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మంద బలం, అధికారం ఉందని జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని స్పష్టం చేశారు.