Thursday, 19 March 2026

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్… నలుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణ గడ్చిరోలి-నారాయణపుర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గడ్చిరోలి డివిజన్‌కి చెందిన గట్టా దళాల్, కంపెనీ నెం.10 మావోయిస్టులు ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సంచరిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రెండు రోజుల క్రితం 19సీ-60 కమాండో యూనిట్లు, క్విక్ యాక్షన్ టీమ్స్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అక్కడే క్యాంపులు వేసి కూంబింగ్ మొదలు పెట్టాయి.

గత రెండు రోజులుగా వర్షం పడుతున్నా భద్రతా దళాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను కొనసాగించారు. నిన్న ఉదయం మావోయిస్టులు భద్రతా దళాలపై ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించడంతో దళాలు స్పందించాయి. రెండు వర్గాల మధ్య సుమారు 8 గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు సంఘటనా ప్రదేశం నుంచి నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశం ఉందని భావిస్తూ భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో మీడియాతో పంచుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు