మెగా ఫ్యాన్స్ UK అంతటా ఉంటారు, ఉన్నారు, కానీ ఒక గ్రూప్‌ను ఏర్పరచడం, జనాన్ని కూడగట్టడం, హీరోతో/హీరో యొక్క మేనేజర్ తో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల కొందరు ఫ్యాన్స్ గ్రూప్‌కు లీడర్స్/chiefsగా నిలుస్తారు & Exceptional interest తో ఏ Event ని అయినా ముందుకు నడిపిస్తుంటారు. ఈ విధంగా రవిశంకర్ సిద్ధం, చంద్ర సిద్ధం, శ్రావణ్ చిదురాల అనే ముగ్గురు వ్యక్తులు “Mega Power Fans Group UK” అనే వాట్సాప్ గ్రూప్‌కు Incharges గా ఉన్నారు, ఇంతకుముందు జరిగిన Mega Events ఎన్నో successful గా జరిపారు. (Naga babu గారు వచ్చినప్పుడు గానీ, Pavan Kalyan గారు వచ్చినప్పుడు గానీ) ఏ మీటింగ్కీ ఎప్పుడూ Money రావు, ఫాన్స్ ఏ తమ సొంతంగా మనీ వేసుకుని Event/ Meeting సక్సెఫుల్ అయ్యేలా చూసుకుంటారు, అది అందరికి తెలుసు.
ఈ Mega Power Fans Group UK అనే గ్రూప్‌ను 18th september 2019 లో ప్రారంభించారు. మార్చి 10th 2025 కి ఈ గ్రూప్‌లో సుమారు 300 మంది సభ్యులు ఉన్నారు.
చిరంజీవి కి మరియు MEGA FAMILY కి సంబంధించిన ఏ get together అయినా meeting అయినా rally అయినా మెగా ఫాన్స్ అసోసియేషన్ UK కి incharges అయిన రవి శంకర్ & చంద్ర నే initiation తీసుకుంటారు
చిరంజీవి UK వస్తున్నారు, stay tuned అని మొదటగా 13th March 2025 March 2025 న రవి శంకర్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు
తర్వాత పడిన పోస్ట్ అవార్డు గురించి
మొదట రవి శంకర్ & చంద్ర, మెగాస్టార్ Felicitation in UK గురించి మాత్రమే పోస్ట్ లు వేశారు, అందరూ దాన్ని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా share చేశారు. ఈ దశ లో కేవలం అవార్డు గురించి మాత్రమే ప్రచారం చేయగా,
ఈవెంట్ గురించిన update రెండు రోజుల తర్వాత పోస్ట్ చేశారు along with whatsapp group joining link , వెంటనే గ్రూప్ లో 1000 మెంబెర్స్ చకచకా జాయిన్ అయ్యారు.
అవార్డు ముందు రోజు అనగా 18th రోజు ఈవెంట్ గురించిన అనౌన్సమ్నెట్ మొదటిసారిగా చేశారు “Registration & Tickets sale will be open soon” “Watch the space” అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి Facebook & WhatsApp ద్వారా Commercial Event కింద ప్రచారం చేశారు.
అదే రోజు అనగా March 18th, మంగళవారం రాత్రి, 10 గంటలకు ఈవెంట్ బ్రైట్‌లో టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు. 30 నిమిషాల్లో 80% టిక్కెట్లు అమ్ముడయ్యాయి. హాల్ 850 మంది కెపాసిటీ కలిగి ఉండగా, టికెట్ ధర £22 – £50 మధ్య ఉంది.
మార్చి 19 ఉదయం 10 AM కి last anouncemnet చేశారు about paid evnet.
తర్వాత shocking & surprising గా 11:56 AM కి admins/organisers ఈవెంట్‌ను free event గా మార్చామని ప్రకటించారు (మొదట organisers decided to make it free అని ప్రకటించారు)
దాంతో గ్రూప్లో మరియు బయటా అందరూ హర్షాతిరేకాలతో టికెట్లు రిజిస్టర్ చేసుకున్నారు
చిరంజీవి ట్వీట్ – గందరగోళం :
మార్చి 19, 12:54 PM కి group లో Organisers free అని ప్రకటించిన 1 hour కి చిరంజీవి ట్వీట్ చేశారు – “కొందరు ఫ్యాన్ మీటింగ్ కోసం డబ్బు వసూలు చేస్తున్నారు” అని.
వెంటనే ఈనాడు & బిగ్ టీవీ న్యూస్ ఆర్టికల్స్ రాశాయి కోట్ల రూపాయల గోల్ మాల్ అంటూ.
Confusion / గందరగోళం:
అసలు ఇది ఎప్పుడూ ఫ్యాన్ మీటింగ్‌గా ప్రచారం కాలేదని, ఎల్లప్పుడూ కమర్షియల్ ఈవెంట్ గానే ప్రమోట్ చేశామని ఆర్గనైజర్లు చెబుతున్నారు (verified answer from Siddam Sankar, Organiser).
మరి Free Event గా పెట్టమని చిరంజీవి గారు సడన్ గా చెప్పారా తెలియదు లేదా Organisers అబద్దం చెప్తున్నారా తెలియదు ( Mr Ravi refused to answer)
అయితే కూడా Chiranjeevi డైరెక్ట్ గా ఆర్గనైజర్స్ కె చెప్తే సరిపోతుంది కదా మరి ట్వీట్ ఎందుకు పెట్టారు పబ్లిక్ గా తెలియదు
దీనివల్ల ఆర్గనైజర్స్ come చీఫ్ అఫ్ fans group కి bad name అని ఆయన ఆలోచించలేదా లేక conscious గా తెలిసి చేశారా తెలియదు లేక ఆర్గనైజర్స్ జనాల్ని మభ్య పెడుతున్నారా తెలియదు
దీని మీద ఆర్గనైజర్స్ ని reach అయినప్పుడు సరి అయిన ఆన్సర్ రాలేదు, వారే స్వయంగా clarity తో ఒక వీడియో release చేస్తా అన్నారు
అందరికీ వచ్చిన అనుమానాలు
చిరంజీవి ట్వీట్ చేయడానికి గంట ముందుగానే ఈవెంట్ free గా మార్చారు, అయినా సరే మరి చిరంజీవి గారు అలా ఎందుకు ట్వీట్ చేశారన్నది అస్పష్టంగా మారింది.
అంటే చిరంజీవి గారికి తెలియకుండా commercial event చేద్దామ్ అని ఆర్గనైజర్స్ అనుకున్నారా
లేక organise చేసి surprising గా చిరంజీవి గారి కి చెప్పి మెప్పిద్దాం అనుకున్నారా?
ఎక్కడ misfire అయింది?
Organiser రవిశంకర్ ఏమంటున్నారు ?
రవిశంకర్ గారిని BTJ ప్రతినిధి సంప్రదించగా, కొన్నిటికి సమాధానం ఇవ్వగా మరి కొన్నిటికి సమాధానాలు ఇవ్వడానికి నిరాకరించారు.
Question & Answers యధాతధంగా :
BTJ Reporter:చిరంజీవి గారికి చెప్పకుండా టికెట్లు ఎందుకు అమ్మారు, paid event అని ఆయనకి తెలియదా?
Ravi Sankar:సర్ (Chiranjeevi) కి తెలుసు
BTJ Reporter:మరి Chiranjeevi గారు డెసిషన్ సడన్ గ చేంజ్ చేసుకున్నారా?
అయితే కూడా అదే మాట మీతో డైరెక్ట్ గా చెప్పి ఉంటే సరిపోయి ఉండేది కదా
ఎలాగు సర్ ట్వీట్ చేయడానికి ముందే మీరు group లో Free Event అని anounce చేశారు కదా, Free పెట్టండి registration అంటే సరిపోయేది కదా, ఇంత గందరగోళం & కాంట్రవర్సీ అయ్యేది కాదుగా ? చిరంజీవి గారు పబ్లిక్ గా మీ మీద against గా ఎందుకు ట్వీట్ చేయవలసి వచ్చింది? (some individuals, without my knowledge లాంటి మాటలు మీ గురించే కదా )?
Ravi Sankar:దానికి మేము ఒక సెపెరేట్ video చేసి clarity ఇద్దామనుకుంటున్నాము, ETV & Big TV తప్పుతప్పుగా రాశాయి, Im glad you guys reached for verification, మొత్తం క్లారిటీ మేమె ఇస్తాము, ప్లీజ్ వెయిట్.
BTJ Reporter:ఈవెంట్‌కు సంబంధించిన ఖర్చులు ఎవరు భరించారు?
Ravi Sankar:70 మంది వాలంటీర్లు ఈవెంట్ కోసం పని చేసారు, ఒక్క ఫారిన్ డ్యాన్స్ టీం కి తప్ప ఎవరికీ డబ్బు ఇవ్వలేదు.
BTJ Reporter:When would you release the pictures for Press?
Ravi Sankar:లేదు చిరంజీవి గారి mnager come PR team కి total data ఇచ్చేసాము
మాకు ఎలాంటి access లేదు data కి.
ఈవెంట్ ఎలా జరిగింది?
అత్యంత అస్తవ్యస్తంగా, గందరగోళంగా సాగింది.
చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడ్డారు, టిక్కెట్లు ఉన్నప్పటికీ లోపలికి అనుమతించలేదు, దాంతో బయట చలిలో వెయిట్ చేశారు చిన్న పిల్లలతో సహా.
Seating గందరగోళం –ఒక 100 మంది stage ముందుకు వచ్చి నిల్చోవడంతో, మిగిలిన వారందరికీ visibility లేకుండా పోయింది (ఆ నిల్చున్న వారు ఆర్గనైజర్స్ ఆ లేక నార్మల్ ఆడియన్స్ ఆ తెలియదు, No clarity from organisers) .
చిరంజీవి 4 గంటలు ఉండాల్సి ఉండగా, ఒక్క గంటకే వెళ్లిపోయారు.
Dance performances అవసరమేలేదు కానీ organisers అనవసరంగా వాటికి ప్రాధాన్యం ఇచ్చారు, ఈ కంగాళీకి చిరంజీవి గారు ఒక గంటలోనే వెళ్లిపోయారు. Anchoring పేలవంగా సాగింది, (anchor కాదు anchoring, with no welcome note, no felicitation by telugus or any such) selfie లు organisers కి మరియు వాళ్లకి తెలిసిన వాళ్లకి మాత్రమే దొరికాయి అని అభియోగం , vloggers & influencers కే ప్రాధాన్యం దొరికింది అని ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి చెందారు . సరిగా organise చేయలేకపోయారు అనే bad reputation, organisers మూటగట్టుకున్నారు.

ఇంతకీ అసలు తప్పు ఎక్కడ జరిగింది ?
క్లారిటీ లేకుండా ప్రమోషన్
ఫ్యాన్ మీటింగ్ vs కమర్షియల్ ఈవెంట్ అనే స్పష్టత లేకపోవడం వల్ల, crowd control లేకపోవడం వల్ల, సమయపాలన, స్టేజ్ మేనేజ్‌మెంట్ ఇలా చాలా చోట్ల, చాల తడబాట్లు జరిగాయి. టిక్కెట్లు ఉన్నప్పటికీ చాలా మందిని లోపలికి అనుమతించలేదు అని complaints.
ఫాన్స్ కూడా discipline లేకుండా shake hand ఇచ్చేందుకు మూకుమ్మడిగా చిరంజీవి గారి మీద మీదకి రావడం ఎంత వరకు కరెక్టో అభిమానులే ఆలోచించుకోవాలి. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవిని చూసిన ఆనందలో క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారు, రసాభాస చేశారు.

Fans దగ్గర నుంచి చిరు ఇలాంటి బిహేవియర్ expect చేసి ఉండకపోవచ్చు లేదా ఇంకేదైనా కారణమో గాని అయాన 1 hour లోనే వెళ్లిపోయారు. Dance performances పెట్టకుండా, group wise సీటింగ్ పెట్టి ప్రతి గ్రూప్ దగ్గరకి చిరు వెళ్లడమో లేక చిరు దగ్గరకి గ్రూప్ wise గా పంపడమో జరిగి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు, ఈవెంట్ అసలు ఉద్దేశం Fan Interaction/ Fan Meeting కాగా గందరగోళం గా ఎలా మారిపోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ కంగాళీకి చిరంజీవి గారు ఒక గంటలోనే వెళ్లిపోయారు. దీంతో అందరూ ఎంతో నిరాశగా తిరిగి వెళ్లారు. Selfie లు దొరికినవాళ్ళు, shake hand దొరికినవాళ్లు మాత్రం ఎంతో ఉత్సాహంగా తిరిగి వెళ్లారు & స్టేటస్ లు పెట్టుకుని మురిసిపోయారు.