Monday, 2 March 2026

ముంబైలో భారీ వర్షాలు… 250కి పైగా విమాన సర్వీసులపై ఎఫెక్ట్

ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల (Mumbai Rains) కారణంగా రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) ముంబయికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 250కి పైగా విమానాలు (Flight Affected by Rains) ఆలస్యమయ్యాయని లేదా రద్దయ్యాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 9:50 గంటల మధ్య 8 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు, సగటున 45 నిమిషాల ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసి, సంబంధిత వెబ్‌సైట్లలో విమాన సమయాలను తనిఖీ చేయాలని సూచించింది.

ఇండిగో, స్పైస్‌జెట్, అకాసా ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. వరదలతో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాలని సూచించాయి. రైల్వే పట్టాలు నీటమునిగిన కారణంగా ముంబయి లోకల్ రైళ్లు కూడా రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేయాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) విజ్ఞప్తి చేసింది.

గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ. వర్షం కురిసినట్లు IMD తెలిపింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు