UKలో వయసు పైబడిన డ్రైవర్లకు కాగ్నిటివ్ మరియు కంటి పరీక్షలు తప్పనిసరి చేయాలన్న సూచన.
రోడ్డు భద్రత కోసం ఇలాంటి మార్పులు అవసరమా, లేక ఇది నిబంధనల పేరుతో వయసు పైబడ్డవాళ్ళని ఇబ్బంది పెట్టడమా అనే చర్చ.
వృద్ధ డ్రైవర్లకు టెస్టులు తప్పనిసరి?
80 ఏళ్లకు పైబడినవారికి కొత్త డ్రైవింగ్ టెస్టులను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై వ్యతిరేకత కనిపిస్తుంది. డ్రైవర్లకు కొత్త కంటి పరీక్షలు, కాగ్నిటివ్ టెస్టులు ప్రవేశపెట్టాలనే డిమాండ్ UK లో చాలాకాలంగా ఉంది. వయసైపోయిన వాళ్లవల్ల ప్రమాదాలు జరుగుతుండటం ఇందుకు కారణం. వాళ్ళ లైసెన్స్ లు అలాగే ఉండాలంటే కొత్తగా అమల్లోకి తెస్తామంటున్న రెండు టెస్ట్ లకు కూర్చోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి, 70 ఏళ్లు వచ్చిన తర్వాత డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం DVLA ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ధ్రువీకరణ చేసుకుంటున్నారు. ఇది మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేసుకోవాల్సిన ప్రాసెస్. ఐతే, 91 ఏళ్ల ‘ఎడిత్ డంకన్’ అనే వ్యక్తి ఓ చిన్నారిని ఢీకొట్టిన ఘటన జరిగిన తర్వాత సాధారణ హెల్త్ చెకప్ మాత్రమే కాకుండా, రెండు క్రిటికల్ టెస్ట్ లను అటెండ్ చేయాల్సిన అవసరాన్ని గురించి ఆలోచిస్తున్నారు. వయస్సు మీద పడిన డ్రైవర్లు ఇతర డ్రైవర్లలా డ్రైవ్ చేసే నైపుణ్యాన్ని కోల్పోతారు కాబట్టి 80 ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేక కాగ్నిటివ్ టెస్ట్ టెస్ట్ లు తప్పనిసరి చేయాలనే వాదన ఉంది.
వ్యతిరేకత చూపిస్తున్న వృద్ధులు!
ఐతే, కొంతమంది వృద్ధులకు ఈ నిర్ణయం నచ్చట్లేదు.
“నా వయసు 87. నా బుద్ధికి వచ్చిన సమస్యేమీ లేదు. 24 ఏళ్ల కుర్రాడికన్నా ఎక్కువ బుద్ధి నాకు ఉంది!” అని ఒక పెద్దాయన మండిపోతున్నారు.
“ట్రాఫిక్ లైట్ల రంగులు గుర్తుపట్టడానికి ఇబ్బంది పడేది చిన్నపిల్లలు. మేము కాదు. పిల్లలకి ట్రాఫిక్ లైట్ల రంగులు గుర్తించడానికి పరీక్షలు జరపాలి. మాకు కాదు..” అని మరొక వృద్ధుడి కామెంట్.
“వయసులో ఉన్న యువకులు డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. వారికోసం డ్రగ్ టెస్ట్ చేయించాలి. మేము బాధ్యతగా అలాంటి పనులేం చేయకుండా రోడ్లపైకి వాహనాల్ని తెస్తున్నాం.. మాపై ఇలాంటి నిబంధనలు పెట్టడం కరెక్ట్ కాదు.. మీకు కూడా ఏదోకరోజు వయసు మీదపడుతుంది. అది ఆలోచించి చెప్పండి..” అని ఇంకొకరు ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారు.
“ఒక్క ఘటన జరిగినంతనే వయసు పైబడిన అందరినీ ఇబ్బంది పెట్టాలనుకోవడం ఎంతవరకు సరైంది? మిగతావాళ్ళంతా ఎందుకు ఇబ్బంది పడాలి. అధికారులు ఎన్నో సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉన్నవాళ్ళని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేయడం బాగా లేదు. ఒకట్రెండు ఘటనల్ని చూపి అందరూ అలాగే ఉంటారు అనుకోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు..” అనేది మరొకరి అభిప్రాయం.
భిన్న వాదనలు
ప్రస్తుతం తాము ఫిట్ గానే ఉన్నామని 70 ఏళ్ల వయసున్నవాళ్లు చేస్తున్న సెల్ఫ్-సర్టిఫికేషన్ డిఫెక్టివ్ గా ఉన్నట్లు, ఆ విధానం ఇప్పుడు పని చేయదని తేలదని షెరిఫ్ ప్రిన్సిపాల్ రాస్ అంటున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా తమ ఆరోగ్య పరిస్థితిని అప్లికేషన్స్ లో సరిగా చెప్పట్లేదని, అది కాస్త కఠినతరం చేయడం అవసరమనేది ఆయన చెప్తున్నారు. ఈ టెస్ట్ ద్వారా వ్యక్తులకు డిమెన్షియా వంటి కండిషన్స్ ఉన్నా తెలుస్తుంది. కొత్త రూల్స్ ని వ్యతిరేకించే వాళ్లకి ఈ సమస్య ఉన్నట్టు ఇప్పటిదాకా వాళ్ళకే తెలియకపోవచ్చనేది జడ్జ్ అభిప్రాయం.
కొత్త నిబంధనలు రోడ్ సేఫ్టీని మరింత పెంచుతాయని, అందుకు వయసు పరిమితి దాటిన అందరూ సహకరించాలని ఇతరులు అంటున్నారు. వృద్ధులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశమున్నా ఇది తప్పదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సరైందో, కాదో అనే విషయం మీద ఇంకా చర్చ జరుగుతోంది.
Practical Driving Test New Rules of Driving Test UK Practical Driving Test UK Driving Test