మనుషులందరు పేరు ప్రఖ్యాతులు పొందడం, బాగా సంపాదించడం, సౌకర్యవంతమైన జీవితం ఎందుకు సాధ్యం కాదు?
వాడు అంతే సంపాదించలేదు తింటాడు తిరుగుతాడు ఎదో అలా బతుకుతున్నాడు. వాడు అంతే రా ఏది చేసినా నష్టమే తప్ప లాభం రావడం లేదు. వాడు వాడి భార్య పిల్లలు అందరు అంతే ఒక్కరికి కూడా తెలివి లేదు పద్దతి లేదు అందరు అంతే వాళ్ళ బతుకులు అంతే. వాడు అంతేరా వాడికి ఇచ్చి కూడా లాభం లేదు వేస్ట్ గాడు. వాడికి ఎన్ని సార్లు చెప్పినా బుర్రకు ఎక్కడం లేదు ఎక్కుతుంది తిరిగి అదే పరిస్థితికి వస్తాడు. ఈ మాటలు మీరు మాట్లాడి ఉంటారు, బాగా విని ఉంటారు.
చుట్టూ ఉండేవాళ్ళలో బాగా సంపాదించిన వాళ్ళు కనిపిస్తారు ఏమి సంపాదించకుండా బతికే వాళ్ళు కనిపిస్తారు, అలాగే అప్పులు చేసి సరిగ్గా తీర్చక ఎదో ఓ విధంగా బతికే వాళ్ళు కనిపిస్తారు. తెలివిగా లాజిక్ గా క్రమశిక్షణతో ఎదిగే వాళ్ళు కనిపిస్తారు. మీరు తెలివైన క్రమశిక్షణతో ఎదిగిన వాళ్ళు అయితే మీరు ఎవర్నో ఒకర్ని పైన చెప్పిన విధంగా అని ఉంటారు.
మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే మనుషులందరికి (కొన్ని మినహాయింపులు) గొప్పవాళ్ళం అనిపించుకోవాలి అని, తెలివైన వాళ్ళం అని ప్రూవ్ చేయాలి అని గౌరవ ప్రతిష్టలు పొందాలి అని బాగా సంపాదించాలి అని ఈ లక్షణాలు మనిషికి ఉండే సహజ లక్షణాలు. మరి ఇవి సహజ లక్షణాలు అయినప్పుడు అందరు ఎందుకు ఎదగడం లేదు సంపాదించడం లేదు క్రమశిక్షణతో ఉండడం లేదు అనే ప్రశ్న వస్తుంది.
ఇవన్నీ సహజ లక్షణాలు కాకపోతే ఇవన్నీ పుట్టుకతో రావాలి లేదంటే పెంపకంతో రావాలి. ప్రతి ఒక్కరికి ఇవి రావు. ఈ కన్నింగ్, స్వార్ధపు, తెలివైన లక్షణాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళందరూ సంపాదిస్తారు, పేరు తెచ్చుకుంటారు, ఎదుగుతారు నలుగురితో వాడిని చూడు అని చూపించుకుంటారు.
ఈ లక్షణాలు రాని వాళ్లు మాములు మనుషులుగా సింపుల్ గా సంపాదన లేకుండా పేరు లేకుండా వచ్చిన కాడికి తిని బతికేస్తారు. వీళ్ళ గురించే పైన అనుకున్నది వీళ్లేందుకు మారడం లేదు అని, ఎందుకు మారరు అంటే వాళ్లకు ఆ లక్షణాలు లేవు, సహజంగా వచ్చే లక్షణాలు లేనప్పుడు బయటి నుండి ఇంజెక్ట్ చేశే లక్షణాలు కొద్దీ సేపు పని చేస్తాయి తరువాత తిరిగి వాళ్ళ ప్రవర్తనకు వాళ్ళు వెళ్ళిపోతారు.
ఎవరికైనా గొప్పవాళ్ళం అనిపించుకోవాలి అని ఉండదా? ఎవరికైనా ధనవంతులం కావలి అని ఉండదా? ఎవరికైనా అందరి చేత గౌరవం పొందాలి అని ఉండదా? అందరికి ఉంటుంది కాని ఈ లక్షణాలు లేని వాళ్లకు ఇవేవి ఉండవు అందుకే వాళ్ళు దేనికి ఆశపడరు
చాలామంది ఇలాంటి వాళ్లకు సిగ్గు శరం లేవు బతకడం తెలియదు సంపాదించడం తెలియదు తిని తాగి తిరుగుతారు పెళ్ళాం పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు ఇంకా రక రకాల మాటలు వాళ్ళను అంటుంటారు. అయితే వాళ్ళు ఇవేవి పట్టించుకోరు వాళ్లకు ఉండే లక్షణాల ఆధారంగా వాళ్ళు జీవిస్తుంటారు.
ఇలాంటి వాళ్ళు ఇంకొకరితో పోల్చుకోరు, ఇంకొకరి లా జీవించాలి అనుకోరు, బాగా సంపాదించి ఇండ్లు కార్లు నగలు కొనాలి అనుకోరు. ఇలాటి వాళ్ళు ఎదుటి వాళ్ళ నుండి గౌరవ మర్యాదలు పొందాలి అని అనుకోరు. వాళ్ళ మానాన వాళ్ళు ఉన్నదాన్ని తిని బతికేస్తారు. ఎవరికీ జవాబుదారిగా ఉండరు, ఎవర్ని పట్టించుకోరు అన్నిటిని ఇగ్నోర్ చేస్తారు.
ఇందులో కొంతమంది జీవితాలు ఎప్పుడు బాగుంటాయి అంటే వాళ్ళ భాగస్వామి తెలివైన కన్నింగ్ మనిషి అయినప్పుడు అలాగే ఇలాంటి వాళ్ళు ధనవంతుల ఇళ్లల్లో పుట్టినప్పుడు మరి కొంతమందికి పిల్లలు తెలివైన వాళ్ళుగా పుట్టినప్పుడు వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉంటాయి. కొంతమంది భార్యా భర్తలు ఒకే విధంగా జత అవుతారు. మరికొంతమందికి పిల్లలు కూడా అలాగే జత అవుతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువమందితో అనిపించుకుంటారు.
సంపాదన, పేరు ప్రఖ్యాతులు, గొప్పతనం ఇవన్నీ మనిషికి పుట్టుకతో వచ్చిన లక్షణాల ఆధారంగా వాళ్ళ కృషి ఆధారంగా వచ్చే విషయాలు. అందరికి అవి రావు రానప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేయరు. ప్రయత్నం చేయడమే లక్షణం. లక్షణమే లేనప్పుడు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అని అడగడం తెలియని తనం.
తెలివి, లాజిక్, కన్నింగ్ ఇవన్నీ ఉన్నవాళ్లు సంపాదించవచ్చు ఎదగవచ్చు గొప్పవాళ్ళు కావొచ్చు అంత మాత్రాన వాళ్ళ పిల్లలు వాళ్ళ మనుమలు మనవరాళ్లు అందరు అదే స్థాయిలో ఎదుగుతారు సంపాదిస్తారు అని అనుకోవొద్దు. మన చుట్టూ ఎంతోమంది ధనవంతుల గొప్ప వాళ్ళ వారసులు ఎందుకు పనికి రాని వాళ్ళుగా ఉన్న సంపదను నాశనం చేశే వాళ్ళుగా మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఇదంతా పుట్టుకతో ఒక్కొక్కరికి వచ్చే లక్షణాలు కాబట్టి. నీకు వస్తే నీ కొడుకుకు నీ మనువడి రావాలి అని రూల్ లేదు కదా. ఎవరి లక్షణాల ఆధారంగా వాళ్ళు జీవితాలను జీవిస్తారు.
మన చుట్టూ ఉండే మాములు మనుషులను వాళ్ళ జీవితాలను ఎగతాళి చేయడం, తరుచు వాళ్ళ గురించి ఇతరులతో చెప్పడం, వాళ్లతో వాళ్ళ గురించి తక్కువా చేసి మాట్లాడడం ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే అలంటి వాళ్ళు రేపు మన ఇంట్లో పుట్టవచ్చు, అదే పరిస్థితి రేపు మనకు ఎదురుకావొచ్చు. వాళ్ళ మానాన వాళ్ళను జీవించనివ్వండి. వాళ్ళు మాములుగా జీవించవచ్చు కాని ఈ డబ్బు పేరు ప్రఖ్యాతులు గొప్పతనం బంగారు ఇవన్నీ ఉన్నవాళ్లకంటే వాళ్ళు రవ్వంత ఎక్కువ సంతోషంగా జీవిస్తుండవచ్చు.