నేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకొని చారిత్రిక ప్రదేశాలు, మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు భారత పురావస్తు సర్వే సంస్థ (Archeological Survey of India – ASI) ఒక ప్రకటనలో తెలిపింది. దేశ చరిత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చరిత్ర గొప్పతనాన్ని తెలియచెప్పడానికి దేశవ్యాప్తంగా అత్యంత విలువైన కళాఖండాలున్న 52 మ్యుజియాల్లో ఉచిత ప్రవేశ సదుపాయం కల్పిస్తున్నట్లు, అలాగే తమ పరిధిలో వున్న 3698 చారిత్రిక ప్రదేశాల్లోనూ ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ అవకాశం కింద తాజ్ మహల్, ఎర్రకోట, హైదరాబాద్ లోని చార్మినార్, గోల్కొండ, సాలర్ జంగ్ మ్యూజియం, ఇటీవలనే వారణాసిలో ప్రారంభించిన మాన్ మహాన్ అబ్జర్వేటరీలోని Virtual Experiential Museum వంటి ప్రదేశాలను ఉచితంగా సందర్శించవచ్చని ASI అధికారులు తెలిపారు.