ఫ్రాన్స్ నుండి ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఆర్టిస్ట్ లు, ఫిలాసఫర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ, వారందరిలోకెల్లా – ఫ్రెంచ్ ప్రజల చేతా, ఇతర ప్రపంచం చేతా ఎంతగానో ప్రేమించబడ్డ జంట Jean-Paul Sartre మరియు Simone de Beauvoir లది.
ఇద్దరూ రచయితలు, తత్వవేత్తలు మరియు సంఘ సంస్కర్తలు. Sartre, Father of Existentialism Philosophy గా గుర్తింపు పొందాడు. de Beauvoir ప్రముఖ ఫెమినిస్ట్ రచయిత్రిగా, 20 వ శతాబ్దపు గొప్ప ఫ్రెంచ్ మహిళగా గుర్తింపు పొందింది. ఆమె ‘𝐒𝐞𝐜𝐨𝐧𝐝 𝐒𝐞𝐱’ పుస్తకం ఎంతో పాపులర్.
వీళ్ళిద్దరూ ఎవరికి వారు గానే, ‘సెల్ఫ్’ అనే భావన పట్ల, ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ పట్ల వాళ్ళ ఆలోచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసినవారే. కానీ, తమ తమ సాహిత్య, తాత్విక, రాజకీయ ఆలోచనలపై ఒకరిపై ఒకరి ప్రభావం ఎంతగా ఉండేదో ప్రపంచానికి వాళ్ళ మరణం తర్వాత, యుక్త వయసులో తాము ఒకరికి ఒకరు రాసుకున్న ఉత్తరాల ద్వారా తెలిసింది..
21 సంవత్సరాల వయసులో Beauvoir, Sorbonne అనే యూనివర్సిటీలో ఫిలాసఫీలో advanced studies చేస్తున్నపుడు, Sartre మొదటిసారి ఆమెకి పరిచయం అవుతాడు. అక్కడ చదువులో ఆమెకి పోటీ ఇవ్వగలిగే మరో వ్యక్తి కూడా Sartre మాత్రమే.
అప్పటికే bold అండ్ rebellious గా ఉన్న Sartre, de Beauvoir ఇద్దరూ, అధికారికంగా పెళ్ళి చేసుకోలేదు. ఒక understanding పై వాళ్ళ రిలేషన్షిప్ జీవితకాలం పాటు కొనసాగింది. కలిసి రచనలు చేసారు. ఇద్దరూ కలిసి పలు సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నారు. ప్రపంచం తిరిగారు. సగటు ఫ్రెంచ్ వ్యక్తి ఎత్తుతో పోల్చుకుంటే Sartre ఎత్తు చాలా తక్కువ(5.1ft). చూపు మెల్ల. ఈ కారణాలతో తనని తానే ‘Ugly’ గా భావించేవాడు Sartre. అందంగా ఉండే Beauvoir అతనికి సరైన జంట కాదని, ఇతరులు వ్యాఖ్యలు చేసినా అవేవీ ఆమెను, అతనితో కలిసి జీవించడానికి అడ్డుపడలేదు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం కెఫెలలో గడుపుతూ, వారి ఆలోచనల్ని చర్చించుకుంటూ ఉండేవారు. రచయితలుగా ఒకరి వర్క్ ని మరొకరు చదువుతూ, సరి చేసుకుంటూ, మంచి రచయితలుగా, ఫిలాసఫర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1964 లో Sartre కి Literature లో Nobel Prize వచ్చింది. For 𝐇𝐮𝐢𝐬 𝐂𝐥𝐨𝐬 aka. 𝐍𝐨 𝐄𝐱𝐢𝐭. తన ఫిలాసఫీతో డిఫర్ అవుతున్న కారణాన దానిని ఆయన స్వీకరించలేదు. ఈ నిర్ణయాన్ని Beauvoir కూడా defend చేస్తూ ఉండేది.
1980 లో Sartre మరణం తర్వాత, 1926-1939 మధ్య కాలంలో Sartre, తనకి రాసిన ఉత్తరాల్ని Beauvoir ‘𝐖𝐢𝐭𝐧𝐞𝐬𝐬 𝐓𝐨 𝐌𝐲 𝐋𝐢𝐟𝐞’ పేరుతో 1983 లో ప్రచురణకి ఇచ్చింది. Sartre, Beauvoir పై తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఇలా రాస్తాడు…
“𝑬𝒗𝒆𝒓𝒚𝒕𝒉𝒊𝒏𝒈 𝑰 𝒕𝒉𝒊𝒏𝒌 𝒐𝒓 𝒇𝒆𝒆𝒍 𝒐𝒓 𝒘𝒓𝒊𝒕𝒆 𝒊𝒔 𝒇𝒐𝒓 𝒚𝒐𝒖. 𝑬𝒗𝒆𝒏 𝒎𝒚 𝒏𝒐𝒗𝒆𝒍 𝒂𝒏𝒅 𝒎𝒚 𝒋𝒐𝒖𝒓𝒏𝒂𝒍, 𝒘𝒉𝒊𝒄𝒉 𝒐𝒕𝒉𝒆𝒓 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒘𝒊𝒍𝒍 𝒆𝒗𝒆𝒏𝒕𝒖𝒂𝒍𝒍𝒚 𝒔𝒆𝒆, 𝒂𝒓𝒆 𝒇𝒊𝒓𝒔𝒕 𝒇𝒐𝒓 𝒚𝒐𝒖, 𝒂𝒏𝒅 𝒐𝒏𝒍𝒚 𝒕𝒉𝒓𝒐𝒖𝒈𝒉 𝒚𝒐𝒖 𝒇𝒐𝒓 𝒐𝒕𝒉𝒆𝒓𝒔.”
Sartre, Beauvoir కన్నా ఆరు సంవత్సరాల ముందే మరణించాడు. తను రాసిన అన్ని పుస్తకాలు, వాటి ద్వారా వచ్చిన ప్రైజెస్, పలు స్త్రీ ఉద్యమాలలో తన భాగస్వామ్యం కన్నా, Sartre తో జీవితకాలం కొనసాగిన రిలేషన్షిప్ నే తన గొప్ప విజయంగా.. తన చివరి పుస్తకం ‘𝐅𝐚𝐫𝐞𝐰𝐞𝐥𝐥 𝐭𝐨 𝐒𝐚𝐫𝐭𝐫𝐞’ లో Beauvoir పేర్కొంది. 1986 లో ఆమె కూడా మరణించింది. Eventually, ఆమె, తాను ఒక్కప్పుడు Sartre కి రాసిన ఉత్తరాలు ‘𝐋𝐞𝐭𝐭𝐞𝐫𝐬 𝐭𝐨 𝐒𝐚𝐫𝐭𝐫𝐞’ అనే పేరుతో ప్రచురితం అయ్యాయి. ఆ ఉత్తరాలలో ఆమె Sartre ని ‘My dear little being’ అని ప్రస్తావించేది.. , Sartre ఎత్తువల్ల కావచ్చు…


