రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆగస్టు 15, 2025న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ తూర్పు దొనెట్స్‌క్ ప్రాంతం నుంచి పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేశారు. పుతిన్ ప్రతిపాదన ప్రకారం, దొనెట్స్‌క్‌ను వదులుకోవడం ద్వారా ఖెర్సన్, జపోరిజియా ప్రాంతాల్లో ఫ్రంట్‌లైన్‌ను స్థిరీకరించవచ్చని సూచించారు. ట్రంప్ ఈ డిమాండ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ, యూరోపియన్ నాయకులకు తెలియజేశారు. కానీ జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఎందుకంటే ఉక్రెయిన్ రాజ్యాంగం భూభాగాన్ని వదులుకోవడాన్ని నిషేధిస్తుంది పైగా దొనెట్స్‌క్‌లో కీలక రక్షణ నగరాలు ఉన్నాయి.
లుహాన్‌స్క్‌తో పాటు దొనెట్స్‌క్ డాన్‌బాస్ ప్రాంతంలో భాగం. ఇది కీలక పారిశ్రామిక కేంద్రం. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ప్రసిద్ధి. ప్రస్తుతం దొనెట్స్‌క్‌లో 70% రష్యా ఆధీనంలో ఉంది. మిగిలిన 30% ఉక్రెయిన్ నియంత్రణలో ఉంది. ఇందులో ముఖ్యమైన రక్షణ స్థానాలు ఉన్నాయి. ఈ మిగిలిన ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. అయితే విశ్లేషకులు ఇది ఉక్రెయిన్‌ను భవిష్యత్ దాడులకు బలహీనంగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు.
అలాస్కా సమావేశంలో యుద్ధ విరమణ ఒప్పందం కుదరలేదు. అయితే ట్రంప్ చర్చలు సానుకూలంగా జరిగాయని, పుతిన్ వాటిని “సకాలంలో మరియు ఉపయోగకరంగా” ఉన్నాయని పేర్కొన్నారు. జెలెన్‌స్కీని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. కానీ ఆయన ఆగస్టు 18, 2025న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో సమావేశం కానున్నారు, ఇందులో యూరోపియన్ నాయకులు కూడా పాల్గొంటారు. పుతిన్ డిమాండ్‌లు ఆమోదయోగ్యం కాదని, యుద్ధాన్ని సాగదీసే వ్యూహంగా ఉండవచ్చని ఉక్రెయిన్ అధికారులు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు సూచిస్తూ ట్రంప్ త్వరిత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ వివరాలు స్పష్టంగా లేవు.