Englandలో Prince Harryకి సంబంధించి జరిగిన పోలీసు రక్షణపై న్యాయపరమైన కేసులో ఆయనకు కోర్టులో ఓటమి ఎదురైంది.
కేసు నేపథ్యం:
Prince harry 2020లో రాజకుటుంబంలోని “వర్కింగ్ మెంబర్” స్థానాన్ని వదిలి అమెరికా వెళ్ళిన తర్వాత, UKకి వచ్చినప్పుడు పూర్తిస్థాయి పోలీసు రక్షణ ఇవ్వడం గ్గించబడింది. అప్పటినుంచి Harry అనేక సందర్భాల్లో భద్రతా విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకి రక్షణ కల్పించకపోవడాన్ని న్యాయస్థానంలో సవాలు చేశారు. తాను ఇంకా రాజ కుటుంబ సభ్యుడేనని, తనకి భద్రతా ముప్పు ఉన్నదని, రాయల్ ఫ్యామిలీ మెంబర్గా తాను UKకి వచ్చినప్పుడు కనీసం “పర్సనల్ ఫండింగ్ ద్వారా” రక్షణ కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని Harry కోరాడు.
కోర్టు తీర్పు:
లండన్ హైకోర్టు 2024లో ఇచ్చిన తీర్పులో, UK ప్రభుత్వ నిర్ణయం సరైనదే అని పేర్కొంది. “హ్యారీకు సాధారణ ప్రజలకే లభించే స్థాయిలో రక్షణ ఇవ్వడంపై తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైనదే.” అని న్యాయమూర్తి తెలిపారు. “పబ్లిక్ పోలీస్ ఫోర్సును ప్రైవేట్ రక్షణ కోసం అద్దెకు ఇవ్వలేము” అని కోర్టు స్పష్టం చేసింది.
ఇది ప్రిన్స్ హ్యారీకి న్యాయ పరంగా ఒక ముఖ్యమైన ఓటమి. భవిష్యత్లో UKకి హ్యారీ, ఆయన కుటుంబం వస్తే, తక్కువ స్థాయిలో భద్రత, లేదా ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్ మీద ఆధారపడే అవకాశం ఉంది.
ఇది రాయల్ ఫ్యామిలీతో హ్యారీ, మేఘన్ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చు.