Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్
  • తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా
  • పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం
  • అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?
  • RAW నూతన సారథిగా పరాగ్ జైన్
BTJBTJ
Sunday, June 29
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News»Cinema

పవన్‌ సినిమా రిలీజ్‌‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు: దిల్ రాజు

May 26, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

టాలీవుడ్ సినీ పరిశ్రమకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ రెండు ప్రభుత్వాలను కలుపుకుని తాము ముందుకెళ్తామన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్మాత దిల్ రాజ్ విలేకర్లతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని వివాదాలను యూనిటీగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో కలిపి కమిటీ వేస్తామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి అన్ని అంశాలు తీసుకు వెళ్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 30, ఉత్తరాంధ్రలో 20 లీజ్ థియేటర్లు తనకు ఉన్నాయని వివరించారు.

ఏప్రిల్ 19వ తేదీన అసలు థియేటర్ల గొడవ మొదలైందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక ఎగ్జిబిటర్లు.. తమ ఇబ్బందులపై సమావేశం పెట్టారని వివరించారు. పర్సంటేజ్‌ విధానం కావాలని వారు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు – ఎగ్జిబిటర్లు మధ్య వివాదం తలెత్తిందని చెప్పారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఈ వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. సినిమా రిలీజ్‌ చేస్తే ఫస్ట్‌ వీక్‌ రెంట్‌.. సెకండ్‌ వీక్‌ నుంచి పర్సంటేజ్‌ అమల్లో ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. దీంతో ఈ వివాదం తూర్పు గోదావరి జిల్లా నుంచే మొదలైందని దిల్ రాజు పేర్కొన్నారు.

అయితే మే 18వ తేదీన ఒక సమావేశం నిర్వహించాలని తాము అనుకున్నామన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను నిర్మాతల దృష్టికి తీసుకెళ్లాలని కోరానని తెలిపారు. కానీ థియేటర్ల మూసివేత అంశాన్ని మాత్రం ప్రతిపాదించ వద్దని వారికి చెప్పానని గుర్తు చేశారు. కానీ ఛాంబర్‌కు ఎగ్జిబిటర్లు లేఖ ఇచ్చారని చెప్పారు. అందులో తమ సమస్యలు పరిష్కరించకపోతే.. థియేటర్లు మూసివేస్తామని వారు ఆ లేఖలో ప్రస్తావించారని వివరించారు.

అప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనన్నారు. ఇక ఎగ్జిబిటర్లతో డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగిందని తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ సమస్యలు చెప్పారని తెలిపారు. సినిమాలు విడుదలవుతున్నాయి.. థియేటర్ల మూసివేత నిర్ణయం వద్దన్నారని చెప్పారు. ఇప్పటి వరకు జరిగింది ఇదేనని దిల్ రాజు స్పష్టం చేశారు.

అయితే పవన్‌ కల్యాణ్ సినిమా రిలీజ్‌ అవుతుందని ప్రస్తుతం సబ్జెక్ట్‌ డైవర్ట్‌ అయ్యిందని.. అయినా పవన్‌ సినిమా రిలీజ్‌ను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరన్నారు. కానీ మధ్యలో రాంగ్‌ కమ్యూనికేషన్‌ జరిగిందని పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్‌ తనతో మాట్లాడారన్నారు.

థియేటర్ల మూసివేత ఉండదని ఆయనతో తాను స్పష్టం చేశానని తెలిపారు. మిస్‌ కమ్యూనికేషన్‌ వల్లే ప్రస్తుతం వివాదం నెలకొందన్నారు. జూన్‌ 11వ తేదీన కమల్‌హాసన్‌, 12వ తేదీన పవన్‌..20వ తేదీన కుబేరా సినిమాల రిలీజ్‌లు కాబోతున్నాయన్నారు. అలాగే జులై, ఆగస్టులోనూ చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా దిల్‌ రాజు వివరించారు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Andhra Pradesh Politics Cinema Industry Unity Dil Raju Distributor Exhibitor Dispute June 2025 Releases Movie Release Conflict Pawan Kalyan Telugu Film Industry Theater Shutdown Tollywood News
Previous Articleమావోయిస్టుల మృతదేహాల కోసం ఐదు రోజులుగా బంధువుల ఎదురుచూపులు
Next Article Northwest London బ్రెంట్ అగ్నిప్రమాదంలో మరణించిన తల్లి మరియు ముగ్గురు పిల్లల పేర్లు ప్రకటించిన అధికారులు
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి: ఉపరాష్ట్రపతి ధన్‌కర్

india news June 29, 2025

రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్…

Add to Bookmark Bookmark

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా

June 29, 2025

పల్నాడు జిల్లాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం

June 29, 2025

అమెరికా లో ఎంట్రీకి హెచ్‌-1బీ కి ప్రత్యామ్నాయం ఓ-1 అవుతుందా?

June 29, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.