కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై షికోపుర్ ల్యాండ్స్ వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలుల చేయడంపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం తన బావ రాబర్ట్ వాద్రాను వెంటాడుతోందని విమర్శించారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసును ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా, ప్రియాంక దంపతుల కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గత పదేళ్లుగా ఈ ప్రభుత్వం చేతిలో మా బావ వేధింపులకు గురవుతున్నారు. తాజా ఛార్జిషీట్ కూడా రాజీకయ కక్షతో చేసే దాడికి కొనసాగింపుగా ఉంది. ఇవన్నీ దురద్దేశపూరితమైన, రాజకీయ ప్రేరణతో కూడి నిందలు, వేధింపులే. ఈ సమయంలో రాబర్ట్, ప్రియాంకా వారి పిల్లలకు మద్దతుగా ఉంటా. వారు ఎలాంటి హింసనైనా తట్టుకునేంత ధైర్యంగా ఉన్నారని నాకు తెలుసు. ఇకపై అలాగే ఉంటారు. చివరికి నిజమే గెలుస్తుంది అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.