నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడిందని, డైరెక్టర్ రాజ్ నిడమారుతోనే డేటింగ్ చేస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. తాజాగా ఆమె అతనితో కలిసి ఉండటానికి ఇల్లు కూడా వెతుకుతోందని వార్తలు వచ్చాయి. అయితే ఆమె మేనేజర్ మాత్రం అందులో నిజం లేదంటూ వార్తలను ఖండించారు.
“రాజ్ తన మాజీ భార్య శ్యామలికి 2022లోనే విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడు. రాజ్ తన కూతురితో కలిసి కనిపించాడన్న వార్తల్లో నిజం లేదు. అతనికి కూతురే లేదు. అవన్నీ ఉత్త పుకార్లే అని – మేనేజర్ ఒకే మాటలో కొట్టిపారేశారు.
ప్రొడ్యూసర్ గా సమంత నిర్మించిన తొలి సినిమా శుభం. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ సక్సెస్ ను సమంత.. రాజ్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించాడు. శుభం మూవీని సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెబుతూ చేసిన పోస్టులో సమంత.. రాజ్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. చాలా రోజులుగా వీళ్లు డేటింగ్ లో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఫొటోలు వాటికి మరింత బలం చేకూర్చాయి.