అమెరికన్ గాయకుడు Chris Brownను 2025 మే 15న Englandలోని Manchesterలో అరెస్టు చేశారు. 2023 ఫిబ్రవరిలో Londonలోని Tape Night Clubలో జరిగిన బాటిల్ దాడి కేసులో శారీరక హాని కలిగించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
కేసు వివరాలు
దాడి ఘటన: 2023 ఫిబ్రవరి 19న, Londonలోని Mayfair ప్రాంతంలోని Tape Nightclubలో Chris Brown సంగీత నిర్మాత Abraham Diawను Don Julio 1942 Tekila బాటిల్‌తో తలపై కొట్టి, అనంతరం పంచ్‌లు, కిక్‌లు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో Diawకు తలపై గాయాలు, మోకాలి లిగమెంట్లు చించుకుపోయాయని సమాచారం. దీంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది .
సివిల్ కేసు: 2023 అక్టోబరులో Diaw ఈ దాడికి సంబంధించి Chris Brownపై $16 మిలియన్ (సుమారు £12 మిలియన్) సివిల్ కేసు దాఖలు చేశారు.
అరెస్టు వివరాలు
Chris Brown 2025 మే 14న ప్రైవేట్ జెట్‌లో Manchesterకు చేరుకున్నారు. ఆ రాత్రి 2 గంటల సమయంలో, Manchesterలోని Lowry హోటల్లో ఆయనను Metropoliton Police అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన grievous bodily harm ఆరోపణలపై పోలీస్ కస్టడీలో ఉన్నారు .
సంగీత ప్రదర్శనలపై ప్రభావం:
ఈ అరెస్టు, క్రిస్ బ్రౌన్ యొక్క 20 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న “బ్రీజీ బౌల్ XX” ప్రపంచ పర్యటనపై ప్రభావం చూపవచ్చు. ఈ పర్యటనలో Manchester, London, Glasgo, Birmingham వంటి నగరాల్లో ప్రదర్శనలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రదర్శనలు యథాతథంగా జరుగుతాయా లేదా అనేది స్పష్టత లేదు .
Chris Brown గత చట్టపరమైన సమస్యలు:
Chris Brownకు గతంలో కూడా చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయి. 2009లో గాయకురాలు Rihanaపై దాడి కేసులో దోషిగా తేలారు. అలాగే, 2017లో మాజీ గర్ల్‌ఫ్రెండ్ Caruche Tran ఆయనపై 5 సంవత్సరాల Restraining Order పొందారు.