Thursday, 15 January 2026

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇండియా బాట్స్మన్ చేతేశ్వర్ పుజారా

టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం ప్రటచించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్​లో పోస్ట్ చేశాడు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఆస్ట్రేలియాపై పుజారా తన ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమ్ఇండియా జట్టులో ఆడలేదు.

‘టీమ్ఇండియా జెర్సీ ధరించి, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలో దిగిన ప్రతీసారి భారత్ జట్టు కోసం అత్యుత్త ప్రదర్శన ఇవ్వడానికి ట్రై చేయడాన్ని మాటల్లో చెప్పలేను. అది నాకు ఎంతో గౌరవం. కానీ, ప్రతీ దానికి ఓ ముగింపు అనేది ఉంటుంది. అందుకే అపారమైన కృతజ్ఞతతో నేను భారత క్రికెట్​లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’ పుజారా తన పోస్ట్​లో రాసుకొచ్చాడు.

కాగా, 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా టెస్టుల్లో తనదైన ముద్రవేశాడు. టీమ్ఇండియా తరపున 100 టెస్టు మ్యాచ్​లు ఆడిన అతికొద్ది మంది క్రికెటర్లలో పుజారా ఒకడు. సుదీర్ఘ కాలంలో 103 టెస్టుల్లో పుజారా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. 2023 జూన్​లో పుజారా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక వన్డేల్లో కేవలం 5 మ్యాచ్​ల్లోనే ఆడాడు

ఇవి తప్పక చదవండి

ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ డ్రా ఖరారు

లివర్‌పూల్ జట్టు బార్న్స్లీపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ సందడి మొదలైంది. సోమవారం రాత్రి జరిగిన డ్రాలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఖరారయ్యాయి. ఈ రౌండ్‌లో ముఖ్యంగా...

నేటి స్కాటిష్ బడ్జెట్: ఆర్థిక సవాళ్ల మధ్య షోనా రాబిన్సన్ కీలక నిర్ణయాలు

నేడు మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు స్కాటిష్ ఆర్థిక మంత్రి షోనా రాబిన్సన్ హోలీరూడ్ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల పౌండ్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం...

తీవ్ర ఒత్తిడిలో హాస్పిటల్స్: నాలుగు ఎన్.హెచ్.ఎస్ ట్రస్ట్‌లలో ‘క్రిటికల్’ పరిస్థితులు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్: చలి తీవ్రత పెరగడం, ఫ్లూ మరియు నోరోవైరస్ కేసులు ఊహించని రీతిలో పెరగడంతో సరీ, కెంట్ మరియు ససెక్స్ ప్రాంతాల్లోని నాలుగు కీలక ఎన్.హెచ్.ఎస్ (NHS) హాస్పిటల్ ట్రస్ట్‌లు...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు