భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌తో తన అనుబంధాన్ని ముగించాడు. జట్టు హెడ్ కోచ్‌గా కేవలం ఒక్క సీజన్ మాత్రమే పనిచేసిన అనంతరం ద్రావిడ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. 2025 ఐపీఎల్ సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన కనబరచడమే ఈ నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది.
గత ఏడాది భారత జట్టు హెడ్ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, ద్రావిడ్ మార్గనిర్దేశంలో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 2025 సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ద్రావిడ్ తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
ఈ పరిణామంపై రాజస్థాన్ రాయల్స్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రకటన విడుదల చేసింది. “రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు తన పదవీకాలాన్ని ముగించుకుంటున్నాడు. జట్టు ప్రయాణంలో ద్రవిడ్ కీలక పాత్ర పోషించాడు. అతడి నాయకత్వం ఎందరో యువ ఆటగాళ్లను ప్రభావితం చేసింది” అని ఫ్రాంచైజీ పేర్కొంది. ఫ్రాంచైజీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ద్రావిడ్‌కు మరింత పెద్ద బాధ్యతను అప్పగించాలని చూసినప్పటికీ, అతడు దానిని స్వీకరించడానికి ఇష్టపడలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
ద్రావిడ్‌కు వీడ్కోలు పలుకుతూ రాయల్స్ యాజమాన్యం ఓ భావోద్వేగపూరిత పోస్ట్ చేసింది. “పింక్ జెర్సీలో మీ ఉనికి యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లందరికీ స్ఫూర్తినిచ్చింది. మీరు ఎప్పటికీ రాయలే. మీకు ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం” అని తమ పోస్టులో పేర్కొంది. గతంలో ఆటగాడిగా కూడా ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు 46 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.