మంగళవారం (జులై 15, 2025) మహారాష్ట్రలోని పర్బాణి జిల్లాలోని పాత్రి-సేలు రోడ్డుపై కదులుతున్న స్లీపర్ కోచ్ బస్సులో రితికా ధేరే అనే 19 ఏళ్ల యువతి తన భర్త అల్తాఫ్ షేక్ తో కలిసి ప్రయాణిస్తుండగా ఒక మగ బిడ్డను ప్రసవించగా, కొద్దిసేపటికి ఆ నవజాత శిశువును గుడ్డలిఓ చుట్టి బస్సు కిటికీ నుంచి బయటకు విసిరిన దారుణ ఘటన జరిగింది. కిటికీలోంచి ఏదో విసిరేసినట్లుగా గమనించిన బస్ డ్రైవర్ అల్తాఫ్ ను ప్రశ్నించగా అతను సమాధానం దాటవేశాడు.
ఉదయం 6.30 గంటలకు బస్సులోంచి బస్సు కిటికీలోంచి ఏదో పడటం గమనించిన స్థానికులు ఆ గుడ్డల మూటను విప్పి చూడగ్గా అందులో చిన్నారిని చూసి షాక్ కు గురయ్యారు. అయితే ఆ శిశువు అప్పటికే మృతి చెందింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బస్సు వద్దకు చేరుకొని, దాన్ని అడ్డగించిన పోలీసులు ప్రయాణీకుల్ని విచారించి రితికా, అన్సారీలను పట్టుకున్నారు. తమకు బిడ్డను పోషించే శక్తి లేకనే పారేశామని ఆ దంపతులు తెలియచేశారు. అయితే వారిద్దరూ భార్యా భర్తలు అని చెప్పేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని పోలీసులు తెలియచేశారు. యువతిని సంరక్షణ కేంద్రానికి తరలించారు.
పోలీసులు ఈ ఘటనపై బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్ 94 కింద కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.