కాంగ్రెస్ నాయకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న MLC అభ్యర్థుల జాబితా వచ్చేసింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ MLC అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది. MLC అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లను ఎంపిక చేశారు. అయితే మరో సీటును సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్.
MLA కోటాలో ముగ్గురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే అందరి అంచనాలకు భిన్నంగా, అనూహ్యంగా ఈ కోటాలోకి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎంపిక అయ్యారు. అయితే ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన మాట ప్రకారమే ఆమెకి అవకాశం వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.