భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించే బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట పూర్తైంది. గతేడాది కంటే రూ.4లక్షల 99వేలు అధికంగా పలికిన లడ్డూ వేలం పాట ఈ యేడు రికార్డు సృష్టించింది.. ఏకంగా రూ.35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి రూ.35 లక్షలకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. బాలాపూర్ లంబోదరుడి చేతిలో నవరాత్రులు పూజలందుకున్న లడ్డు వేలం పాటతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే గణేశుడి లడ్డూ వేలం పాట కోసం సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు భక్తులు.
ఈ సంవత్సరం కూడా బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం అత్యంత ఉత్సహంగా , ఉత్కంఠభరితంగా సాగింది. లడ్డూ వేలం పాటలో పాల్గొనేందుకు 38 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రతి ఏటా పెరుగుతున్న లడ్డూ వేలం పాట ఈ యేడు 4లక్షల 99వేలు అధికంగా, రూ.35 లక్షలు దాటింది. పలికిన బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్. గత ఏడాది 30 లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు కొలన్ శంకర్‌రెడ్డి.


