Friday, 20 March 2026

హైదరాబాద్‌ విచ్చేసిన సీబీఐ డైరెక్టర్ ఎందుకు?

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని రోజులకే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌లో ఆకస్మికంగా పర్యటించడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం కాళేశ్వరం కేసు దర్యాప్తులో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. నిన్న నగరానికి చేరుకున్న ఆయన హైదరాబాద్ జోన్ సీబీఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష రెండు గంటలకు పైగా కొనసాగినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 1న కేంద్రానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ పరిణామం జరిగిన వెంటనే సీబీఐ డైరెక్టర్ స్వయంగా హైదరాబాద్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, ఈ పర్యటన ఉద్దేశంపై స్పష్టత కొరవడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ సూద్ సమీక్షలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అందిన లేఖ, ప్రాథమిక ఆధారాలు, హైకోర్టు ఆదేశాలు వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, కాళేశ్వరం వ్యవహారంలో సీబీఐ తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు