పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా 25 పిస్తాహౌస్ రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించి 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తనిఖీలో తేల్చారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. తుప్పు పట్టిన నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించినట్లు, కిచెన్ గదులు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు.
ఇవి తప్పక చదవండి
గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు
లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...
ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం
లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...
ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.
నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...


