Saturday, 21 March 2026

దేశంలోనే తెలంగాణలో మొదటి సారి వరుసగా రెండు నెలల పాటు నెగటివ్ ద్రవ్యోల్భణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా వరుసగా రెండు నెలల పాటు జూన్, జూలైలలో నెగిటివ్ ద్రవ్యోల్బణం (deflation) నమోదు చేసింది. ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. గతంలో కోవిడ్-19 సమయంలో 10 శాతానికి పైగా ద్రవ్యోల్బణంతో దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక ద్రవ్యోల్బణం లేదా నెగిటివ్ ద్రవ్యోల్బణం రెండూ కూడా ఆర్థిక వ్యవస్థలో ఒకరకమైన ఒత్తిడిని సూచిస్తాయి.

గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై నెలలో తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల సంయుక్త ద్రవ్యోల్బణ రేటు -0.44 శాతంగా ఉంది. అదే సమయంలో జాతీయ సగటు 2.10 శాతంగా నమోదైంది. జూన్‌లో తెలంగాణలో ద్రవ్యోల్బణం -0.93 శాతంగా ఉండగా, జాతీయ సగటు 1.55 శాతంగా ఉంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంత ద్రవ్యోల్బణం జూన్‌లో -0.91 శాతం నుంచి జూలైలో -1.54 శతానికి పడిపోయింది. ఈ పరిస్థితి ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడాన్ని.. ఆర్థిక కార్యకలాపాలు మందగించడాన్ని సూచిస్తుంది.

వ్యాపార విశ్లేషకుడు ఈ గీతానంద్ ప్రకారం.. నెగిటివ్ ద్రవ్యోల్బణం అనేది మంచి సంకేతం కాదు.. ప్రజలు కనీస అవసరాలకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు కూడా మందగించాయని ఆయన వివరించారు. ప్రభుత్వం పథకాల ద్వారా లేదా ఉద్యోగాల కల్పన ద్వారా మార్కెట్‌లోకి మరింత డబ్బును విడుదల చేయడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చని ఆయన సూచించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి చిట్టేడి ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం 2 శాతం నుండి 4 శాతం మధ్య ఉండాలని సూచిస్తుంది. దీనికి గణనీయంగా తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ద్రవ్యోల్బణం సున్నాకి పడిపోయిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ప్రజల చేతుల్లో డబ్బులు లేవని ఇది స్పష్టం చేస్తుందని.. ప్రజలు తమ ఆస్తులను చూసుకుని సంతోషించడం మానేసి, పని చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ఒక ఎక్స్ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే.. నిపుణులు దీనికి విభిన్నంగా స్పందిస్తున్నారు. దీర్ఘకాలిక నెగిటివ్ ద్రవ్యోల్బణం అనేది వినియోగదారులు ధరలు మరింత తగ్గుతాయని ఆశించి కొనుగోళ్లను వాయిదా వేసేలా చేస్తుంది. ఇది డిమాండ్‌ను తగ్గించి.. ఉత్పత్తి, ఉద్యోగాల నష్టానికి దారితీస్తుంది.

ప్రస్తుత ట్రెండ్ ఎక్కువగా ఆహార ధరలు, బేస్ ఎఫెక్ట్‌ల వల్ల వచ్చిందని.. డిమాండ్ పూర్తిగా పడిపోవడం వల్ల కాదని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను నిశితంగా పరిశీలించడం చాలా అవసరం. ధరలు నిరంతరం పెరుగుదల అనేది ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుండగా.. ధరలు తగ్గడాన్ని ప్రతి ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. ధరలు తగ్గినా.. ప్రజలు కొనుగోలు చేయకపోవడం అనేది ప్రజల వద్ద డబ్బులు లేవనే సంకేతాన్ని సూచిస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు