అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అయిదు యుద్ధ విమానాలు కూలినట్లు ట్రంప్ వెల్లడించారు. రిపబ్లికన్ ప్రతినిధులతో జరిగిన డిన్నర్ భేటీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఏ దేశ యుద్ధ విమానాలు కూలిపోయానన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఇది నమ్మలేరు, గాలిలోనే విమానాలను పేల్చేశారు. అయిదో నాలుగో.. నాకు తెలిసి అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారని ట్రంప్ ఆ మీటింగ్‌లో అన్నారు
Add A Comment