Saturday, 21 March 2026

ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో గట్టి షాక్.. హార్వర్డ్‌కు అనుకూలంగా కీలక తీర్పు

ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి అమెరికా ఫెడరల్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూనివర్సిటీకి కేటాయించిన బిలియన్ల డాలర్ల పరిశోధన నిధులను నిలిపివేయడం చట్టవిరుద్ధమని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. యూదు వ్యతిరేకతను (యాంటీ-సెమిటిజం) ఒక సాకుగా చూపి, దేశంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం సైద్ధాంతిక దాడికి పాల్పడిందని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ మసాచుసెట్స్ జడ్జి అల్లిసన్ బరోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివరాల్లోకి వెళితే… ఈ ఏడాది ఏప్రిల్ 11న ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి పలు డిమాండ్లతో కూడిన లేఖను పంపింది. క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను అరికట్టాలని, కొన్ని మైనారిటీ వర్గాలకు అనుకూలంగా ఉండే వైవిధ్య (డైవర్సిటీ), ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (DEI) కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించింది. అయితే, ఈ డిమాండ్లను హార్వర్డ్ తిరస్కరించడంతో ఏప్రిల్ 14న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. బహుళ-సంవత్సరాల గ్రాంట్ల కింద రావాల్సిన 2.2 బిలియన్ డాలర్లతో పాటు, 60 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు విలువను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ చర్య అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ, పౌర హక్కుల చట్టంలోని టైటిల్ VI నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని జడ్జి బరోస్ తన తీర్పులో పేర్కొన్నారు. “మనం యూదు వ్యతిరేకతపై పోరాడాలి. అదే సమయంలో మన హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలి. ఒకదాని కోసం మరొకదాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. ఆలస్యంగానైనా హార్వర్డ్ ద్వేషపూరిత ప్రవర్తనను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటోందని, రాజ్యాంగం ప్రకారం విద్యా స్వేచ్ఛను కాపాడటం కోర్టుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విచారణ లేకుండానే హార్వర్డ్‌కు అనుకూలంగా ఆమె తీర్పు ఇచ్చారు.

అయితే, ఈ తీర్పును ట్రంప్ యంత్రాంగం తోసిపుచ్చింది. “పన్ను చెల్లింపుదారుల డాలర్లపై హార్వర్డ్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు. భవిష్యత్తులో కూడా గ్రాంట్లకు అనర్హులుగా ఉంటారు” అని వైట్‌హౌస్ ప్రతినిధి లిజ్ హస్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను వేధింపుల నుంచి కాపాడటంలో హార్వర్డ్ విఫలమైందని ఆమె ఆరోపించారు. ఇదే తరహాలో విద్యాశాఖ కూడా స్పందించింది. “ఈ తీర్పు ఆశ్చర్యం కలిగించలేదు. దేశ విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసే మా ప్రయత్నాలు కొనసాగుతాయి” అని విద్యాశాఖ ప్రతినిధి మాడీ బీడర్‌మాన్ పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు