Kent కు చెందిన ఓ మహిళ తన కారు రిజిస్ట్రేషన్ ప్లేట్ క్లోన్ చేయబడిందని గుర్తించింది.
280 Miles (340 కిమీ) దూరంలో ఉన్న Liverpool లో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహించాలని ఆమె ఇన్సూరెన్స్ కంపెనీ ఆరోపించాకే ఈ విషయం తనకి తెలిసింది.
Herne Bay కు చెందిన Shelli Birkett, ఈ ఘటనను వివరిస్తూ ఇలా చెప్పింది: “నేను నా జీవితంలో ఒక్కసారికైనా Liverpool కు వెళ్లలేదు! నేను అక్కడ లేనని Insurance Company కి నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాను” “ఆ సమయంలో నేను నా ఇంట్లోనే నా పనుల్లో నిమగ్నమై ఉన్నాను” అని Shelli Birkett, తెలిపారు. “అది నేనుకాదని చెప్పాను, “నేను అక్కడ లేనని చెప్పాను. అయినా, వారు నేనెక్కడున్నానన్నదాని గురించి ఆధారాలు ఇవ్వమని కోరారు.” “నా కార్ కండిషన్ ఫొటోలు పంపించమన్నారు, విచారణ అలా కొనసాగిస్తూ వెళ్లారు.” “ఈ మొత్తం పరిస్థితే భయంకరంగా అనిపించింది.”
Ms Birkett కి ఆ తర్వాత ఓ కీలకమైన విషయం గుర్తుకు వచ్చింది. తనకి Google Locations ఉపయోగించుకోవచ్చని గుర్తొచ్చింది. అదృష్టవశాత్తూ, ఆ రోజు నేను హెర్న్ బేలోనే ఉన్నాను. నా బిజినెస్ సోషల్ మీడియా పేజీలో కొన్ని వీడియోలు పోస్ట్ చేశాను. ఆ రోజు నేను పని చేస్తున్నానని అవి నిరూపించాయి. అలాగే, నా నంబర్ ప్లేట్ మాత్రమే కాదు… నామీద మోసగాళ్లు చేసిన ఘోరం ఇంతటితో ముగియలేదు. నాకున్న కార్ మోడల్‌కే సరిపోయేలా మరో కార్‌పై నా నంబర్ ప్లేట్‌ను అమర్చారు!”
ఇలాంటి సంఘటనలు కారు నంబర్ ప్లేట్ మోసానికి గురైన బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడిస్తున్నాయి. ఈ మోసాల్లో కారు నంబర్ ప్లేట్లు నకిలీగా తయారు చేయబడడం లేదా నేరస్తులచే దొంగిలించబడడం జరుగుతుంది. Kent పోలీసులు ఈ తరహా నేరాలు గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతున్నాయని తెలిపారు.
నేరస్తులు రెండు రకాలుగా నంబర్ ప్లేట్లను దొంగిలిస్తారు:
ప్రస్తుతం ఉన్న వాహనం నుంచి నేరుగా ప్లేట్లను దొంగిలించడం. కారు నంబర్ ప్లేట్‌లను నకిలీగా తయారు చేయడం, దాన్ని మరొక కారుపై అమర్చడం. ఈ మోసం కారు కొనుగోలు, సెల్లింగ్ వెబ్‌సైట్లు వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా ఎక్కువగా జరుగుతోంది. నేరస్తులు ఇంటర్నెట్‌లో పోస్టైన కార్ ఫొటోలను ఉపయోగించి నంబర్ ప్లేట్లను క్లోన్ చేస్తున్నారు.
🚨 Amazonలో Car Number Plates అమ్మకానికి నిషేధం!
గత నెలలో Online Retailer Amazon సంచలన నిర్ణయం తీసుకుంది – ఇప్పుడు దాని Platformలో Car Number Plates విక్రయం పూర్తిగా నిషేధం!
BBC London చేసిన సీక్రెట్ పరిశోధనలో Amazon నుంచి అక్రమంగా Number Plates సరఫరా అవుతున్నట్లు బయటపడటంతో, Amazon ఈ చర్య తీసుకుంది.
ఈ నిషేధం Number Plate Cloning మరియు Theft మోసాలను అరికట్టడానికి కీలకమైన ముందడుగు అని అధికారుల అభిప్రాయం.
📊 Number Plate Theft – Kentలో 37% పెరుగుదల!
తాజా గణాంకాల ప్రకారం, Kentలో Number Plate Theft కేసులు గణనీయంగా పెరిగాయి. గత నాలుగేళ్లలో ఈ మోసాలు 37% పెరిగాయి.
2024లో 1,120 కేసులు నమోదయ్యాయి, అయితే 2020లో ఈ సంఖ్య 815 మాత్రమే ఉంది.
(Based on Freedom of Information Request)
Car Cloning కారణంగా Londonలో రద్దయిన fines సంఖ్య కూడా భారీగా పెరిగింది, మూడు ఏళ్లలో ఈ సంఖ్య 64% పెరిగింది.
Authorities ఇప్పటికే Road Safety Strategy పై దృష్టి పెట్టి, Number Plate Theft మోసాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు.
🚨 Number Plate Theft – పెరుగుతున్న మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
కారు Number Plate మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. Criminals ఇవి దొంగిలించడం లేదా Cloning చేయడం ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు.
Kent Police Chief Superintendent Rob Marsh ఈ సమస్య గురించి మాట్లాడుతూ, “Number Plate దొంగిలించేవారు వాటిని కేవలం insurance fines నుంచి congestion or toll charges నుంచి తప్పించుకోవడానికి కాకుండా మరిన్ని Crimes కోసం ఉపయోగిస్తున్నారు, ఉదాహరణకు:
✅ Congestion Charges మరియు Road Toll Fees తప్పించుకోవడానికి
✅ Fuel నింపించుకుని డబ్బు చెల్లించకుండా పారిపోవడానికి
✅ ఇతర Illegal Activities కోసం వాహనాన్ని ఉపయోగించడానికి” అని తెలిపారు
మరియు “Cost of Living పెరుగుతున్న కొద్దీ, కొంతమంది ఈ రకమైన Crimes చేయడానికి ప్రేరేపించబడుతున్నారు,” అని ఆయన అన్నారు
“ఒక వాహన యజమాని ఉదయం లేచినప్పుడు తన Number Plate కనిపించకపోతే, అతను Crime Victim అయినట్లు అర్థం. కానీ, కొన్ని సందర్భాల్లో, దొంగిలించడానికి బదులుగా Criminals Number Plate Cloning చేస్తారు, అది Ownerకి తెలియకపోవచ్చు. ANPR (Automatic Number Plate Recognition) Camera ద్వారా ఇది గుర్తించబడిన తర్వాత మాత్రమే మేము ఈ విషయాన్ని తెలుసుకుని దర్యాప్తు ప్రారంభిస్తాము, అని ఆయన అన్నారు.
RAC (Royal Automobile Club) ప్రకారం, నేరస్తులు చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన వాహనం గుర్తింపును చోరీ చేస్తారు.
ఇలా చేయడం వల్ల దొంగతనానికి గురైన లేదా స్క్రాప్‌కు గురైన వాహనాన్ని అడ్డు లేకుండా ఉపయోగించుకోవచ్చు.
🔹 Home Office/ ప్రభుత్వం ఏమంటోంది?
The Home Office ఈ మోసాలను అరికట్టేందుకు DVLA (Driver and Vehicle Licensing Agency) మరియు Police Departmentsతో కలిసి పనిచేస్తోంది.
“Number Plate Cloning లేదా Tampering చేయడం Road Safetyని ప్రభావితం చేస్తుంది, అదే సమయంలో Criminalsకి రక్షణ కల్పించే మార్గంగా మారుతోంది.
మేము అధికారులతో కలిసి ఈ నేరాలను అరికట్టడానికి కృషి చేస్తున్నాం, దాదాపు 10 ఏళ్ల తర్వాత, కొత్త Road Safety Strategy రూపొందిస్తున్నాము!” Officials భావిస్తున్నట్లు, ఈ కొత్త వ్యూహం (Strategy) రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతో పాటు, Crime Activityను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అని హోం ఆఫీస్ ప్రకటించింది.
🚗 వాహన యజమానులు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
🔹 Tamper-proof screws వాడండి, నంబర్ ప్లేట్ సురక్షితంగా అమర్చండి.
🔹 మీ కార్ రాత్రివేళ CCTV పరిధిలో పార్క్ చేయండి.
🔹 మీరు ఎక్కడున్నారో ట్రాక్ చేసే Google Locations లాంటి సేవలను ఉపయోగించండి.
🔹 మీ కారు నంబర్ అనుమానాస్పదంగా వాడుతున్నట్లు అనిపిస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
🚔 జాగ్రత్త – మీ కార్, మీ బాధ్యత!
నకిలీ నంబర్ ప్లేట్ల మోసం పెరుగుతున్నందున, ప్రతి వాహన యజమాని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి!
మీకు Driving Penalty లేదా UKEZ/LEZ Penalty లేదా Toll-Free Penalty వస్తే , కంగారు పడి వెంటనే పే చేయకండి, ఎందుకంటే అది మీకు నిజంగా రావలసిన Penalty కాకపోవచ్చు. ఎవరో ఇతరులు మీ కార్ నంబర్‌తో Drive చేసి ఉండొచ్చు, ఎందుకంటే Car Number theft/cloning scams ఎక్కువయ్యాయి.
Write to us on britishtelugujournal@mail.com if you ever have such experience.