విద్యార్ధులందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా ఓ హెడ్ టీచర్ ను డిప్యూటీ హెడ్ టీచర్ పై ఓ హెవీ డ్యూటీ స్పానర్ తో దాడి చేశారు. ఇందుకు అదే పాఠశాలలో పనిచేస్తున్న మరో టీచర్ తో ట్రై యాంగిల్ ప్రేమ వ్యవహారమే కారణం. అయితే ఈ దాడికి ముందే ఆ హెడ్ టీచర్ తాను చేయబోయే పనికి క్షమాపణలు కోరుతూ మిగతా సిబ్బందికి ఒక మెయిల్ కూడా పెట్టడం ఇక్కడ ట్విస్టు! “ఇవాళ జరగబోయే పరిణామాలకు కారణమైన నా అంతరంగ క్షోభకు విచారిస్తున్నాను..” అని సెయింట్ జోసఫ్స్ కేథలిక్ స్కూల్ హెడ్ టీచర్ డా.జాన్ ఫెల్టన్ తన డిప్యూటీ హెడ్ టీచర్ రిచర్డ్ పైక్ పై దాడి చేసే ముందు మిగతా సిబ్బందికి మెయిల్ చేశారు.
బుధవారం ఉదయం 10 గంటలకు కొంచెం ముందుగా డా.ఫెల్టన్ ఒక స్పానర్ చేతబట్టి డిప్యుటీ హెడ్ టీచర్ రిచర్డ్ పైక్ పై దాడి చేసి తలకి తీవ్రమైన గాయాలు చేశారు. వెంటనే పాఠశాలకి ఎమర్జెన్సీ సర్వీసెస్ ని రప్పించి పైక్ ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. అయితే తలకి తగిలిన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని తెలిసింది. దాడి చేసినందుకు ముగ్గురు పిల్లల తండ్రి ఐన డా.ఫెల్టన్ ని సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేయడం జరిగింది.
సంఘటన గురించి మొబైల్ సందేశాలు రాగానే కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలకు హుటాహుటీన వచ్చి తమ పిల్లలని తీసుకెళ్లిపోయారు. పాఠశాలని ఎవరు నడిపిస్తారనే విషయంలో తమకి ఓ నిర్దిష్ట హామీ వచ్చేంతవరకు పిల్లలను పాఠశాలకి పంపేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. “పాఠశాలలో టీచర్లు లైంగిక సంబంధాలలో మునిగి తేలుతున్నారు. హెడ్ టీచర్ మరొకరిని ఒక రెంచి తీసుకొని చచ్చేలా కొట్టడమేమిటి?” అని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు.
స్పానర్ తో దాడి ఘటన జరిగినప్పుడు “ఆ టీచర్” అసలు స్కూలులో లేనట్లు తెలిసింది.