లండన్: బ్రిటన్ నౌకాదళంలో సిబ్బందికి ధార్మిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసేందుకు తొలిసారిగా ఒక హిందూ చాప్లెయిన్ (పురోహితుడు)ని నియమించారు. క్రైస్తవుడు కాని వ్యక్తి చాప్లెయిన్‌గా ఎంపిక కావడం ఇదే ప్రథమం.
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన భాను అత్రి ఈ పదవికి ఎంపికయ్యారు. ఈ నియామకంపై తాను గర్విస్తున్నానని భాను అత్రి అన్నారు.