Wednesday, 3 September 2025

యూకేలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. మృతుల్లో ఒకరు హైదరాబాదీ

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK)లోని ఎసెక్స్‌ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన రిషితేజా రాపోలు (21)గా గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. రిషితేజా ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. ఎసెక్స్ పోలీసుల కథనం ప్రకారం.. రేలీ స్పర్ రౌండ్‌అబౌట్ వద్ద డ్యూయల్ క్యారేజ్‌వే A130లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఇల్ఫోర్డ్-బార్కింగ్ ప్రాంతంలో నివసించే తొమ్మిది మంది స్నేహితులు, రూమ్‌మేట్స్‌తో సౌత్‌ ఎండ్‌-ఆన్-సీకి వెళుతుండగా ప్రమాదం జరిగిందని బీబీసీతో సహా స్థానిక మీడియా పేర్కొంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరిని.. రాయల్ లండన్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు